Begin typing your search above and press return to search.

నవదీప్ 2.0.. బోల్డ్ సీన్లతో లవ్ మౌళి ట్రైలర్

టాలీవుడ్ నటుడు నవదీప్.. చాలా రోజుల తర్వాత మళ్లీ హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు

By:  Tupaki Desk   |   9 April 2024 7:56 AM GMT
నవదీప్ 2.0.. బోల్డ్ సీన్లతో లవ్ మౌళి ట్రైలర్
X

టాలీవుడ్ నటుడు నవదీప్.. చాలా రోజుల తర్వాత మళ్లీ హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన నటించిన లవ్ మౌళి చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. కరోనా సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంది. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని ఇటీవల అన్ని పనులు పూర్తి చేసుకుంది. వేసవి కానుకగా ఏప్రిల్ 19వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

ఇటీవల లవ్ మౌళి సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. వరంగల్ లోని NIT కళాశాలలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. విద్యార్థులతో హీరో నవదీప్ ఇంటరాక్ట్ అయ్యారు. సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మేఘాలయలో ఈ మూవీ షూటింగ్ జరిగినట్లు తెలిపారు. మంచి రొమాంటిక్ లవ్ స్టోరీతో వస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా మేకర్స్ లవ్ మౌళి మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.

ప్రపంచంలో మనుషులందరికీ దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి ఒక్కసారిగా ప్రేమ దొరికితే ఎలా ఉంటుందనే కోణంలో లవ్ మౌళి మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. పెయింటర్ అయిన హీరో (నవదీప్).. ట్రావెల్ చేస్తుంటూ ఆర్ట్స్ వేస్తుంటారు. తనకు కావాల్సిన ప్రేమను అందరిలో వెతుక్కుంటూ పలువురు అమ్మాయిలతో ట్రావెల్ చేస్తారు.

ట్రైలర్ ను చూస్తుంటే నవదీప్ ఈసారి కొంచెం బోల్డ్ కంటెంట్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఏదో సర్ప్రెజింగ్ కంటెంట్‌ ఉందనేలా ట్రైలర్‌ ను మేకర్స్‌ కట్‌ చేశారు. మంచి బజ్ క్రియేట్ చేశారు. హీరోయిన్లతో ఘాటైన లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. నవదీప్ డైలాగులు కొన్ని సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. పొడవాటి జుట్టుతో నవదీప్ వైల్డ్ గా కనిపిస్తున్నారు. మల్టిపుల్ వేరియేషన్స్ లో నటనతో అదరగొట్టారు.

ఈ సినిమాకు అవనీంద్ర దర్శకత్వం వహించారు. నైరా క్రియేషన్స్‌, శ్రీకర స్టూడియోస్‌ పతాకాలపై సీ స్పేస్ సంస్థ నిర్మించింది. నవదీప్ సరసన పంఖురి గిద్వానీ హీరోయిన్‌ గా యాక్ట్ చేసింది. భావన సాగి, మిర్చి హేమంత్‌ తోపాటు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. తన స్వీయ అనుభవమే ఈ సినిమా అని నవదీప్ ఇటీవల తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పారు. మరి ఈ మూవీతో ఆయన ఎలాంటి హిట్ కొడతారో వేచి చూడాలి.