Begin typing your search above and press return to search.

20 ఏళ్ల కెరీర్ కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సినిమా..!

ఈ సందర్భంగా నవదీప్ తో పాటుగా చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను మీడియాతో పెంచుకున్నారు.

By:  Tupaki Desk   |   27 May 2024 6:40 AM GMT
20 ఏళ్ల కెరీర్ కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సినిమా..!
X

టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ లీడ్ రోల్ లో నవదీప్ 2.O గా కనిపించబోతున్న సినిమా లవ్ మౌళి. ఈ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచగా.. ఆడియన్స్ లో ఆసక్తి కలిగేలా చేసింది. ఈ సినిమాను నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కింది. జూన్ 7న రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నవదీప్ తో పాటుగా చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను మీడియాతో పెంచుకున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

లవ్ మౌళీ లీడ్ హీరో ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా ప్రెస్ మీట్ లో న‌వ‌దీప్ మాట్లాడుతూ.. అన్ని భాషల్లో ర‌క‌ర‌కాల కొత్త కంటెంట్‌తో సినిమాలు వ‌స్తున్నాయి. అదే కోవ‌లో మన తెలుగులో రాబోతున్న వైవిధ్య‌మైన‌, విభిన్న‌మైన సినిమా ఇది. ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్‌కు ర‌ప్పించే కంటెంట్ సినిమాలో ఉందని అన్నారు. ఆడియన్స్‌కు థియేట‌ర్‌కు ఎందుకు రావాలో అన్న ప్ర‌శ్న‌కు ఈ చిత్రంలో స‌మాధానం దొరుకుతుంది. సినిమాను అద్భుతమైన చిరపుంజి, మేఘాల‌యాలోని ప్ర‌దేశాల్లో షూటింగ్ చేశారు. ఈ క‌థ విన్న‌ప్పుడు అక్క‌డే చేస్తేనే బాగుంటుంది అనిపించింది. అందుకే ఎన్నో వ్య‌య ప్ర‌య‌సాల‌తో షూటింగ్ చేశామని అన్నారు. విశేషం ఏంటంటే ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్ ఎలా జ‌రిగింది అనే దాని మీద ఓ సినిమా తీయ్యెచ్చని అన్నారు నవదీప్.

ఒక మంచి బ్యూటిఫుల్ సినిమా తీశామ‌నే న‌మ్మ‌కం ఈ సినిమా ద్వారా కలిగింది. సినిమా ఫ‌లితం ఆడియ‌న్స్ చేతిలో ఉందని అన్నారు నవదీప్. నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో నా ప్రేమ‌క‌థ‌లు, నా ల‌వ్‌స్టోరీల్లో వున్న పాయింట్‌ను ఈ సినిమాలో ట‌చ్ చేశాం. ఈ క‌థ, ఈ పాయింట్ కనెక్ట్ అయితే వాళ్ల ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు వ‌స్తాయో చూడాల‌ని ఉందని నవదీప్ అన్నారు. నా 20 ఏళ్ల కెరీర్ త‌రువాత నాలో కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తూ చేసిన సినిమా ఇదని అన్నారు నవదీప్.

ఇక ఇదే ప్రెస్ మీట్ లో డైరెక్టర్ అవ‌నీంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేటి యువ‌త‌రానికి కావాల్సిన అంశాలున్నాయి. ఈ సినిమాలో అంద‌రికి రిలేట్ అయ్యే అంశాలు, క‌నెక్ట్ అయ్యే అంశాలున్నాయి అన్నారు. ప్రతి ఒక్కరు ప్రేమ‌లో ఉన్నప్పుడు వారి రిలేష‌న్స్ ఎలా ఉంటాయి. యువ‌త‌రం ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఎందుకు బ్రేక‌ప్‌లు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంప్ర‌మైజ్ అయితే త‌ప్ప రిలేష‌న్స్ నిల‌బ‌డ‌వా? అనే ప్ర‌శ్న‌కు నాకు దొరికిన ప‌రిష్కారాన్ని కూడా ఈ సినిమాలో చూపెడుతున్నామని అన్నారు డైరెక్టర్ అవనీంద్ర.

ఈ సినిమాకు డిఐ కేర‌ళ‌లో జ‌రుగుతున్న‌ప్పుడు మంజుమ్మ‌ల్ బాయ్‌, ఆవేశం సినిమాకు ప‌నిచేసిన క‌ల‌రిస్ట్ మా సినిమాకు పనిచేశారు. ఈ సినిమా చూసి ఆయన ఎంతో అభినందించాడు. సినిమా విడుద‌లైన త‌రువాత కూడా అంద‌రికి న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నానని అన్నారు. ఈ సినిమా కోసం న‌వ‌దీప్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. ఆయ‌న కష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుంద‌నే నమ్మ‌కం వుంది అన్నారు.

నవదీప్ లీడ్ రోల్ లో నటించిన లవ్ మౌళి సినిమాలో పంఖురి గిద్వాని, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు నటంచారు. గోవింద్ వసంత్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు రచన దర్శకత్వంతో పాటుగా ఎడిటింగ్ కూడా డైరెక్టర్ అవనీంద్ర అందించారు.