Begin typing your search above and press return to search.

ఆశిష్ 3 లవ్ మీ.. దెయ్యంతో లవ్ ట్రాకా?

ఇక సినిమాకు సంబంధించిన విశేషాలు కూడా ఆయన తెలియజేశారు. ఈ సినిమాకు "లవ్ మీ: ఇఫ్ యు డేర్" అనే టైటిల్ను ఖరారు చేశారు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 10:20 AM GMT
ఆశిష్ 3 లవ్ మీ.. దెయ్యంతో లవ్ ట్రాకా?
X

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరో ఆశిష్ రెడ్డి మొదటి సినిమా రౌడీ బాయ్స్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆ సినిమాలో నటుడిగా అతను పరవాలేదు అనిపించాడు. ఇక ఇప్పుడు వరుసగా డిఫరెంట్ సినిమాలను లైన్లో పెడుతున్న ఆశిష్ రెడ్డి తన మూడవ సినిమాతో మరింత కొత్తగా ఆకట్టుకుపోతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు ప్రత్యేకంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను అలాగే మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.


ఇక సినిమాకు సంబంధించిన విశేషాలు కూడా ఆయన తెలియజేశారు. ఈ సినిమాకు "లవ్ మీ: ఇఫ్ యు డేర్" అనే టైటిల్ను ఖరారు చేశారు. మోషన్ పోస్టర్ తోనే ఈ సినిమాపై ఒక డిఫరెంట్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాలా త్రిల్లింగ్ గా ఉండబోతుందట. చూస్తుంటే హారర్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఒక భయంకరమైన అపార్ట్మెంట్ లో ఉరితాడు కనిపించడం ఆ తర్వాత అటువైపు నుంచి హీరో స్టైలిష్ గా కనిపించడం చూస్తూ ఉంటే ఈ సినిమాలో హీరో తో పాటు దెయ్యం మధ్యలో ఒక లవ్ ట్రాక్ ఉంటుందేమో అని అనిపిస్తోంది. ఇక ఆశిష్ కు జోడిగా ఈ సినిమాలో వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఇటీవల ఈ రొమాంటిక్ హారర్ చిత్రం షూటింగ్ పూర్తయింది.

బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న బలగం నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డిలు నాగ మల్లిడితో కలిసి "దిల్‌రాజు ప్రొడక్షన్స్" పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శిరీష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆశిష్ పోస్టర్‌ లో హుషారుగా కనిపించాడు, అతని వెనుక ఒక దెయ్యం యొక్క వింత రూపాన్ని హైలెట్ చేశారు. ఈ రొమాంటిక్ హారర్ చిత్రానికి నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు.

ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మంచి టెక్నీషియన్స్ తో కొత్త దర్శకుడు సినిమాను చాలా బాగా తెరపైకి తీసుకు వచ్చినట్లు దిల్ రాజు తెలిపారు. ఒకప్పుడు ఆర్య, దిల్ లాంటి ప్రేమ కథలు విన్నప్పుడు ఎలాంటి ఫీల్ కలిగిందో ఇప్పుడు కూడా అలాంటి ఫీల్ ఈ ప్రేమ కథ విన్నప్పుడు కలిగింది అని అన్నారు. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తో పాటు విడుదల డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిపారు.