Begin typing your search above and press return to search.

ప్రేమ‌? ఆక‌ర్ష‌ణ? చెక్ చేసి ఫిక్స్ చేసిన జోడీ!

వ‌రుణ్ వివాహ‌మాడిన అమ్మాయి న‌టి కావ‌డంతోనే పెళ్లి వ్య‌వ‌హారంపై మ‌రింత ఆస‌క్తి సంత‌రిం చుకుంది.

By:  Tupaki Desk   |   9 Nov 2023 4:30 PM GMT
ప్రేమ‌? ఆక‌ర్ష‌ణ? చెక్ చేసి ఫిక్స్ చేసిన జోడీ!
X

మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్- న‌టి లావ‌ణ్య త్రిపాఠి ప్రేమించి పెద్దల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుణ్ వివాహ‌మాడిన అమ్మాయి న‌టి కావ‌డంతోనే పెళ్లి వ్య‌వ‌హారంపై మ‌రింత ఆస‌క్తి సంత‌రిం చుకుంది. ఏ బిజినెస్ మ్యాన్ కుమార్తోనో? రాజ‌కీయ నాయ‌కుడి కూతుర్నో? పారిశ్రామిక వేత్త కుమార్తెనో వివాహ‌మాడితే? ఒక‌వేళ అది ల‌వ్ మ్యారేజ్ అయినా ఇంతహంగామా ఉండ‌దు.పెళ్లి అయిన మ‌రుసటి రోజు నుంచి మీడియాలో ఎలాంటి క‌థ‌నాలు కూడా రావు.

కేవ‌లం లావ‌ణ్య న‌టి కావ‌డం..అందులోనూ వాళ్ల‌ది ప్రేమ వివాహం కావ‌డంతోనే ర‌క‌రాల‌క ఆరాలు.. విశ్లేష‌ణ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. అయితే ఈ పెళ్లి వెనుక కూడా చాలా విశ్లేష‌ణ‌లు..చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. వ‌రుణ్ -లావ‌ణ్య పెళ్లిని పెద్ద‌లు ఒక్క రోజులో జ‌రిపించేయ‌లేదు. దాని వెనుక చాలా తంత‌గ‌మే చోటు చేసుకుంద‌ని తెలుస్తోంది. వ‌రుణ్ -లావ‌ణ్య తొలిసారి ఇట‌లీలో క‌లుసుకున్నారు. ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ అక్క‌డే మొద‌లైంది.

అయితే అది ప్రేమ‌? ఆక‌ర్ష‌ణ? అన్న డైల‌మా ఇద్ద‌రికీ క‌లిగింది. దీంతో ముందు అది ప్రేమ‌.,.ఆక‌ర్ష‌ణ అని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసారు. అందుకోసం కొంత స‌మ‌యం తీసుకున్నారు. ఈ గ్యాప్ లో ప్రేమ‌..ఆక‌ర్ష‌ణ మ‌ధ్య వ్య‌త్యాసం ఏంటి? అన్న‌ది అర్ధం చేసుకున్నారు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు ఇది ప్రేమే అని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన త‌ర్వాత ఇదే విష‌యాన్ని ఇద్ద‌రు త‌మ కుటుంబ స‌భ్యుల‌కు చెప్పారుట‌.

వాళ్లు కూడా పిల్ల‌లు ఇష్ట‌ప‌డ్డార‌ని కంగ‌రు ప‌డ‌లేదుట‌. అన్ని విష‌యాలు ఆలోచించుకుని ..అందుకు కావాల్సినంత స‌మ‌యాన్ని ఇరుకుటుంబాలు తీసుకుని తుదిగా పెళ్లి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోం ది. పెళ్లంటే నూరేళ్ల పంట‌. ఆ పంట జీవితాంతం స‌రిగ్గా పండాలంటే? తీసుకునే నిర్ణ‌యాలు ఎంతో కీల‌క‌మైన‌వి. అందులోనూ ప్రేమ విష‌యంలో సాధార‌ణంగా పెద్దల ఇన్వాల్వ్ మెంట్ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. కానీ వ‌రుణ్‌-లావ‌ణ్య ఇద్ద‌రు ఇష్ట‌ప‌డిన ద‌గ్గ‌ర నుంచి వెంట‌నే పెద్ద‌ల్ని వాళ్ల ప్రేమ‌లో భాగం చేసిన‌ట్లు తెలుస్తుంది.