Begin typing your search above and press return to search.

'జెర్స'లా 'ల‌వ్ ఆల'..ఏమోష‌న‌ల్ గా ట‌చ్ చేస్తారా?

బ్యాడ్మింట‌న్ నేప‌థ్యంలో 'ల‌వ్ ఆల్' అనే సినిమా తెర‌కెక్కిస్తున్నారు. బ్యాడ్మింట‌న్ మాత్ర‌మే కాదు. క్రీడా ప్ర‌పంచాన్నే ఆవిష్క‌రించే ఓ గొప్ప చిత్రంగా మ‌లుస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Aug 2023 6:33 AM GMT
జెర్సలా ల‌వ్ ఆల..ఏమోష‌న‌ల్ గా ట‌చ్ చేస్తారా?
X

ఒక క్రికెటర్ ప్రయాణాన్ని అతడి వ్యక్తిగత జీవితంతో ముడిపెడుతూ గొప్ప భావోద్వేగంతో చూపించిన సినిమా 'జెర్సీ'. తనకు ప్రాణానికి ప్రాణమైన ఆటకు దూరమై తనను తాను కోల్పోతూ మానసిక సంఘర్షణకు లోనయ్యే క్రీడాకారుడిగా హీరో పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు గౌతమ్. ఆ పాత్రకు నాని లాంటి గొప్ప నటుడిని ఎంచుకోవడంతో తిరుగే లేకపోయింది. సాధారణ పాత్రల్ని కూడా తన నటనతో ప్రత్యేకంగా మార్చగలిగే నాని.. అర్జున్ లాంటి అద్భుతమైన పాత్ర దొరకడంతో చెలరేగిపోయాడు.

హీరో పాత్రే ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా సినిమాను లాక్కెళ్లి పోతుంది. ఇక ఈ కథలో తండ్రీ కొడుకుల బంధాన్ని ఎలివేట్ చేసి తీరు.. అందులోని భావోద్వేగాలు మరో పెద్ద ప్లస్. హీరో.. అతడి కొడుకు మధ్య వచ్చే ప్రతి సన్నివేశాలు.. భార్య‌-భ‌ర్త‌ల మ‌ధ్య చిన్న‌పాటి అస‌మాన‌త‌ల్ని ఎమోష‌నల్ గా క‌నెక్ట్ చేసిన వైనం ప్ర‌శంస‌నీయం. తాజాగా ఇలాంటి ప్ర‌య‌త్నం ఒక‌టి బాలీవుడ్ లో జ‌రుగుతోంది.

బ్యాడ్మింట‌న్ నేప‌థ్యంలో 'ల‌వ్ ఆల్' అనే సినిమా తెర‌కెక్కిస్తున్నారు. బ్యాడ్మింట‌న్ మాత్ర‌మే కాదు. క్రీడా ప్ర‌పంచాన్నే ఆవిష్క‌రించే ఓ గొప్ప చిత్రంగా మ‌లుస్తున్నారు. క్రీడ‌ల్ని కెరీర్ గా ఎంచుకోవాలా? వ‌ద్దా? అనే మీమాంస‌ని సినిమాలో ప్ర‌ధానంగా చ‌ర్చిస్తున్నారు. క్రీడ‌ల్లో రాణించాలంటే? ట్యాలెంట్ ఒక్క‌టే స‌రిపోతుందా? దాంతో పాటు బ్యాకెండ్ లో ఎలాంటి అంశాలు కీ రోల్ పోషిస్తాయి? అనే అంశాలు ట‌చ్ చేస్తున్నారు.

క్రీడ‌ల్లో రాణించాల‌నే క‌ల‌ని మ‌ధ్య‌లో వ‌దిలేసిన వాళ్లు...పిల్ల‌ల ద్వారా ఆ క‌ల‌ని సాకారం చేసుకోవాల నుకునే వాళ్లంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా చిత్రాన్ని సుధాంశ్ శ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌ధాన పాత్ర‌లో కె.కె. మీన‌న్ న‌టిస్తున్నారు. మ‌హేష్ భ‌ట్..ఆనంద్ పండింట్ తో క‌లిసి ఈ చిత్రాన్ని బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపీచంద్ స‌మ‌ర్పిస్తున్నారు. ఈ నెల 25న చిత్రాన్ని ఆరు భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా కూడా ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అవుతుంద‌ని టీమ్ ధీమా వ్య‌క్తం చేసింది.