స్పీడు పెంచిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' హీరో
హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్‌లని దక్కించుకున్న ప్రదీప్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ ఫేవరేట్.
By: Tupaki Desk | 15 April 2025 5:00 PM ISTడైరెక్టర్‌గా తన మార్కు సినిమాలతో ఆకట్టుకున్న తమిళ యువ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ `లవ్ టుడే`తో హీరోగా మారి తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రదీప్ ఆ క్రేజ్‌తో తాజాగా `రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్` మూవీ చేయడం తెలిసిందే. తమిళంలో `డ్రాగన్`గా, తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్`గా రిలీజ్ అయిన ఈ మూవీ రెండు భాషలలోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుని రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది.
హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్‌లని దక్కించుకున్న ప్రదీప్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ ఫేవరేట్. న్యూ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేయాలని ఎదురు చూస్తున్న దర్శకులకు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్‌గా నిలవడంతో ఆయనతో సినిమాలు చేయాలని కొత్త దర్శకులు, పేరున్న యంగ్ డైరెక్టర్లు ప్రస్తుతం క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగానే ప్రదీప్ రంగనాథన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
`లవ్ ఇన్సురెన్స్ కంపనీ` పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకుడు. విఘ్నేష్ శివన్, నటుడు, దర్శకుడు ఎస్.జె.సూర్య, ప్రదీప్ రంగనాథన్ ఈ ముగ్గురు కలిసి ఈ మూవీకి రచన చేశారు. నయనతారతో పాటు మరో ముగ్గురు ఈ మూవీని నిర్మిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న మూవీ షూటింగ్ పూర్తయింది. ఇటీవలే మలేషియా వెళ్లిన టీమ్ అక్కడ పలు కీలక సన్నివేశాలను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌తో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ హీరోగా హ్యాట్రిక్ హిట్‌ని దక్కించుకోవడం ఖాయం అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎస్.జె. సూర్య, యోగిబాబు, మిస్కిన్, గౌరీ జి.కిషన్, ఆనంద్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది