ఆ సినిమా కూడా మరో రామయణమా!
రణబీర్ కపూర్-అలియాభట్ జంటగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో `లవ్ అండ్ వార్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 July 2025 12:34 PM ISTరణబీర్ కపూర్-అలియాభట్ జంటగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో `లవ్ అండ్ వార్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పెళ్లైన తర్వాత ఇద్దరు కలిసి నటిస్తోన్న లవ్ స్టోరీ ఇదే కావడం విశేషం. సంజ య్ లీలా భన్సాలీ నుంచి వస్తోన్న మరో బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే సిని మాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇందులో ఓ కీలక పాత్రను విక్కీ కౌశల్ పోషిస్తున్నాడు. తాజాగా ఈ పాత్రకు సంబంధించి మరింత అప్ డేట్ అందుతోంది. దీన్ని బట్టి చూస్తే ఇది కూడా రామాయణంలో లాంటి స్టోరీనే పోలి ఉందనిపిస్తుంది.
రామాయణంలో సీతను అపహరించి బంధీగా మార్చిన లంకను హనుమంతుడితో కలిసి రాముడు ఎలాంటి చర్యకు దిగాడో? ఈ కథను కూడా సంజయ్ లీలా భన్సాలీ అలాగే మలుస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. దీనిలో భాగంగా కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా ఓ సెట్ సిద్దం చేస్తు న్నారు. ఇందులో రణబీర్ కపూర్ -విక్కీ కౌశల్ మద్య భారీ పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట. ఆ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.
విక్కీ కౌశల్ పాత్ర రామనాసురిడిని పోలి ఉంటుందని...తనకు దక్కని అలియా భట్ కోసం తానెలాంటి చర్య లకు ఒడిగట్టాడు? అన్నది ఒళ్లు గగుర్లు పొడిచే సన్నివేశాలతో ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర వర్గాలం టున్నాయి. ఓ చిన్నపాటి రామాయణనే సంజయ్ లీలా భన్సాలీ తన పాత్రల ద్వారా చూపించ చోతున్నాడుట. ఈసన్నివేశాలకు సంబంధించి చిత్రీకరణ ఆగస్టు నుంచి మొదల వుతుందిట.
దాదాపు 15 రోజుల పాటు ఈ యాక్షన్ బ్లాక్ చిత్రీకరించనున్నారని సమాచారం. ప్రేమ కోసం జరిగే ఈ యుద్ధంలో అలియాభట్ కూడా భాగమవుతుందిట. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలన్నది మేకర్స్ ప్లాన్. అటుపై వచ్చే ఏడాది ఆరంభంలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం అలియాభట్ ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాల షూటింగ్ లతోనూ బిజీగా ఉంది.
