ఆటోరిక్షా హ్యాండ్ బ్యాగ్.. ఖరీదు తెలిస్తే నోరెళ్లబెడతారు!
రిక్షాలు, ఆటో రిక్షాలు కొన్నేళ్లుగా మనందరికీ తెలిసిన శ్రామిక తరగతి రవాణా వాహనాలు. సాధారణ ప్రజలకు వీటి వల్ల ఎంతో ప్రయోజనం.
By: Tupaki Desk | 6 July 2025 9:38 AM ISTఖరీదైన బెంజి ఉండగా ఆటో రిక్షాలో ఎవరైనా వెళతారా? నామోషీ ఫీలవుతారు. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ ఆటో రిక్షానే సెలబ్రిటీని చేసారు మన స్టార్లు. చూస్తుంటే ఆటో రిక్షాలా కనిపిస్తోంది.. దీనిని హ్యాండ్ బ్యాగ్ లా తగిలించేశారేమిటీ! అని షాక్ తినాల్సి వస్తోంది.
కానీ అది ఫ్యాషన్ ప్రపంచం. ఇక్కడ బోలెడంత క్రియేటివిటీ ఏదో ఒక రకంగా చూపించాల్సి ఉంటుంది. అందుకే రెగ్యులర్ గా అందరికీ సుపరిచితమైన ఆటో రిక్షానే ప్రఖ్యాత `లూయీస్ వూటన్` కంపెనీ ఎంపిక చేసుకుంది. ఈ డిజైనర్ బ్యాగ్ ని ఇండియాలో తన ప్రమోషన్స్ కి కూడా ఉపయోగించుకుంటోంది.
రిక్షాలు, ఆటో రిక్షాలు కొన్నేళ్లుగా మనందరికీ తెలిసిన శ్రామిక తరగతి రవాణా వాహనాలు. సాధారణ ప్రజలకు వీటి వల్ల ఎంతో ప్రయోజనం. అయితే ప్రజలకు అంతగా కనెక్టయి ఉన్న ఆటోరిక్షాను చాలా లగ్జరియస్ గా బ్యాగు రూపంలోకి తేవడం వ్యక్తుల క్రియేటివిటీని ఎలివేట్ చేస్తోంది.
ఇంతకీ ఈ బ్యాగ్ ని కొనాలంటే ఎంత తేవాలి? అంటే... 35 లక్షల మేర ఖరీదు చేసే దీనిని ఏదైనా ఆస్తిని అమ్మి మాత్రమే మధ్యతరగతి సొంతం చేసుకోగలదు. బ్యాగ్ ఖరీదు ఒరిజినల్ గా రిక్షా కొనడం కంటే 30 రెట్లు ఎక్కువ. ఈ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ పై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. గ్లోబల్ బ్రాండ్లు ఇప్పుడు ఇలాంటి క్రియేటివిటీతో భారతదేశంలో షాపింగ్ పిచ్చి ఉన్నవాళ్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.