Begin typing your search above and press return to search.

రజినీకాంత్ - లోకేష్.. మరో యంగ్ హీరో

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఇంటరెస్టింగ్ క్యాస్టింగ్ ని ఫినల్ చేసినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 4:01 AM GMT
రజినీకాంత్ - లోకేష్.. మరో యంగ్ హీరో
X

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని లోకేష్ తెరకెక్కించబోతున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ మూవీ కూడా ఉండబోతోందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఇంటరెస్టింగ్ క్యాస్టింగ్ ని ఫినల్ చేసినట్లు తెలుస్తోంది. ఓ కీలక పాత్ర కోసం యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ని ఫైనల్ చేశారంట. అలాగే మూవీలో రజినీకాంత్ కి ప్రతినాయకుడిగా రాఘవ లారెన్స్ ని లోకేష్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కావడంతో లారెన్స్ కూడా కాదనకుండా విలన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.

త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందంట. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఆరు నెలల్లో మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ మూవీలో ఫిమేల్ లీడ్ కోసం ప్రస్తుతం వేట సాగుతోంది. ఈ ఏడాది లోకేష్ నుంచి వచ్చిన లియో మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రజినీకాంత్ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి విమర్శలకి అవకాశం ఇవ్వకుండా కేర్ ఫుల్ గా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జైలర్ మూవీతో రజినీకాంత్ చాలా గ్యాప్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆరు వందల కోట్లకి పైగా కలెక్ట్ చేసింది.

ఇప్పుడు లోకేష్ సినిమా కచ్చితంగా వెయ్యి కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు కోలీవుడ్ నుంచి వెయ్యి కోట్లు కలెక్షన్స్ చేసే ప్రాజెక్ట్ రాలేదు. వచ్చే ఏడాది మాత్రం ఇండియన్ 2, రజినీకాంత్, సూర్య కంగువ సినిమాలు ఆ ఫీట్ అందుకునే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలలో వినిపిస్తోన్న మాట.