Begin typing your search above and press return to search.

లోకేష్ మల్టివర్స్ లో మరో ట్విస్ట్..

లియో తర్వాత లోకేశ్.. రజనీకాంత్ తో 171 సినిమా, అనంతరం సూర్యతో విక్రమ్ రోలెక్స్ పాత్ర ఆధారంగా ఓ సినిమా.. చేసిన తర్వాత కార్తితో సీక్వెల్ చేస్తారని సమాచారం అందింది.

By:  Tupaki Desk   |   19 Aug 2023 11:30 PM GMT
లోకేష్ మల్టివర్స్ లో మరో ట్విస్ట్..
X

తమిళ హీరో కార్తి నటించిన ఖైదీ చిత్రం 2019లో విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు రూపొందుతుందోనని ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఈ మూవీ అటు దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ కు.. హీరోగా కార్తికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే తాజాగా సీక్వెల్ కు సంబంధించి ఓ బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది.

ముఖ్యంగా ఖైదీ చిత్రం.. ఈ సినిమా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కు స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన వరుసగా బడా హీరోలతో భారీ ప్రాజెక్ట్ లను చేయడం ప్రారంభించారు. విజయ్ దళపతితో మాస్టర్ చేయగా అది సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత కమల్ హాసన్ తో విక్రమ్ చేయగా అది పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకుంది.

దీంతో లోకేశ్ కనగరాజ్ లైనప్ లిస్ట్ పెరిగిపోయింది. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశారు. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన మళ్లీ దళపతి విజయ్ తో కలిసి లియో చేస్తున్నారు. సంజయ్ దత్ లాంటి భారీ కాస్ట్ ను ఇందులో భాగం చేశారు. ఈ క్రమంలోనే రజనీకాంత్, హీరో సూర్యలతో సినిమాలను కూడా అనౌన్స్ చేశారు. అలానే కార్తీతో ఖైదీ సీక్వెల్ కూడా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. దీంతో ఖైదీ ఫ్యాన్స్ అంతా తెగ సంబరపడిపోయారు.

దళపతితో లియో అయిపోగానే ఖైదీ సీక్వెల్ కోసం రంగంలోకి దిగుతారని మొన్నటి వరకు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు కథ యూటర్న్ తీసుకుందని తెలిసింది. లియో తర్వాత లోకేశ్.. రజనీకాంత్ తో 171 సినిమా, అనంతరం సూర్యతో విక్రమ్ రోలెక్స్ పాత్ర ఆధారంగా ఓ సినిమా.. చేసిన తర్వాత కార్తితో సీక్వెల్ చేస్తారని సమాచారం అందింది. అంటే ఇంకా చాలాం కాలం పట్టే అవకాశముందని తెలుస్తోంది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేశ్ ను.. రజనీకాంత్ 171 గరుంచి చెప్పమని అడగగా.. ప్రొడక్షన్ సైడ్ అంతా ఓకే. నేను ఇప్పుడే దీని గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడలేను. ప్రొడక్షన్ వారి వైపు నుంచే సమాచారం వస్తుంది అని చెప్పారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీంతో లియో తర్వాత రజనీకాంత్ 171 ఉంటుందన్న ప్రచారం మొదలైంది.