Begin typing your search above and press return to search.

లోకేష్‌, అనిరుద్‌ లు తప్పు చేయబోతున్నారా?

ఇంతకు వారు చేయబోతున్న కొత్త పని ఏంటి అంటే నటన. ఔను వీరిద్దరు కలిసి ప్రధాన పాత్రల్లో ఒక సినిమా రూపొందబోతుంది.

By:  Tupaki Desk   |   13 Sep 2023 5:15 AM GMT
లోకేష్‌, అనిరుద్‌ లు తప్పు చేయబోతున్నారా?
X

దర్శకుడిగా ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ మరియు సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ ల స్థాయి ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. వీరిద్దరు తమిళ్ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు అయినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో వీరిద్దరు కూడా స్టార్స్ అనడంలో సందేహం లేదు. అందుకే వీరిద్దరి తో వర్క్‌ చేయాలని స్టార్స్‌.. సూపర్‌ స్టార్స్ కోరుకుంటున్నారు.

అలాంటి వీరిద్దరు వారి పని వారు చేసుకోకుండా కొత్త పని చేసేందుకు రెడీ అవ్వడంతో వారి అభిమానుల్లో కొందరు విమర్శిస్తున్నారు. ఇంతకు వారు చేయబోతున్న కొత్త పని ఏంటి అంటే నటన. ఔను వీరిద్దరు కలిసి ప్రధాన పాత్రల్లో ఒక సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

తమిళ్‌ సినీ ఇండస్ట్రీ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సన్‌ పిక్చర్స్‌ వారు ఓ భారీ సినిమా ను వీరిద్దరితో నిర్మించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో సినిమా అంటే దర్శకుడు ఎవరు అనే అనుమానం చాలా మందికి రావచ్చు. వీరి కాంబో సినిమాకు ఫైట్‌ మాస్టర్స్ అన్బు అరువు లు దర్శకత్వం వహించబోతున్నారు.

దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ తోపు, సంగీత దర్శకుడిగా అనిరుధ్ తోపు.. ఇలాంటి తోపులు నటులుగా ఎంత వరకు మెప్పిస్తారు అనేది అనుమానం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడిగా స్టార్‌ డం కలిగి ఉన్న లోకేష్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరధ్ నటన వైపు వెళ్లే నిర్ణయం తీసుకోవడం అనేది తప్పుడు నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి వారి అభిప్రాయం తప్పు అంటూ వీరిద్దరు నిరూపిస్తారా అనేది చూడాలి.