Begin typing your search above and press return to search.

ఇది 100% నా స్టైల్ లో ఉంటుంది

లియో సినిమా ఫలితం విషయాన్ని పట్టించుకోకుండా లోకేష్ తదుపరి సినిమా అయిన తలైవర్‌ 171 పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబర్చుతున్నారు.

By:  Tupaki Desk   |   30 March 2024 5:18 AM GMT
ఇది 100% నా స్టైల్ లో ఉంటుంది
X

ఖైదీ, మాస్టర్, విక్రమ్‌ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ భారీ విజయాలను సొంతం చేసుకుని పాన్ ఇండియా స్టార్‌ దర్శకుల జాబితాలో చేరిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ గత చిత్రం లియో విషయంలో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు. విజయ్ స్టార్‌ డమ్‌ కోసం తన మార్క్ ను లోకేష్ పక్కన పెట్టాడా అంటూ కొందరు విమర్శలు చేశారు.

లియో సినిమా ఫలితం విషయాన్ని పట్టించుకోకుండా లోకేష్ తదుపరి సినిమా అయిన తలైవర్‌ 171 పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబర్చుతున్నారు. రజినీకాంత్‌ వంటి సూపర్‌ స్టార్‌ తో లోకేష్ కనగరాజ్ చేయబోతున్న సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో కూడా కనిపిస్తూ ఉంది.

ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ ని విడుదల చేసి అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా ఒక చిట్‌ చాట్‌ లో చేసిన వ్యాఖ్యలు సినిమా పై అంచనాలు అంతకు మించి అన్నట్లుగా ఇంకా పెంచుతూనే ఉన్నాయి.

లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ... తలైవర్ 171 సినిమా కచ్చితంగా నా స్టైల్‌ లో ఉంటుంది. 100% ఇది నా స్టైల్ మూవీ అని చెప్పగలను. పోస్టర్ ఆధారంగా సినిమా కథ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఊహించేసుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికి నేను ఏ విషయాన్ని చెప్పలేను.

గతంలో రజినీ సర్ ను ప్రేక్షకులు ఫ్యాన్స్ చూడని విధంగా నేను చూపించబోతున్నాను. ఆయన్ను నా స్టైల్‌ లో చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. తన గత చిత్రాల మాదిరిగా ఇందులో డ్రగ్స్ ను చూపించబోవడం లేదని కూడా లోకేష్‌ క్లారిటీ ఇచ్చాడు.