Begin typing your search above and press return to search.

లోకేష్ కనగరాజ్.. లిస్టులో టాలీవుడ్ బడా స్టార్స్!

అందులో ముఖ్యంగా ప్రభాస్ ఎన్టీఆర్ లతో కూడా సినిమా చేయడానికి ఆ సంస్థ ఇదివరకే చర్చలు జరిపింది. ముఖ్యంగా ప్రభాస్ తో డేట్స్ కోసమైతే చాలా కాలంగా ఎదురుచూస్తోంది.

By:  Tupaki Desk   |   14 March 2024 9:02 AM GMT
లోకేష్ కనగరాజ్.. లిస్టులో టాలీవుడ్ బడా స్టార్స్!
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో అటు సొంత భాషలోనే కాకుండా ఇటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు. అంతకు ముందు వచ్చిన సినిమాలు కూడా అతనికి మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ఇక విజయ్ తో చేసిన లియో సినిమా కూడా కమర్షియల్ గా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. నెక్స్ట్ అతను రజనీకాంత్ ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పనుల్లో చాలా బిజీగా ఉన్న లోకేష్ వీలైనంత తొందరగా ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. అలాగే అతని లిస్టులో మరికొన్ని క్రేజీ కాంబినేషన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లోకేష్ యూనివర్స్ లో భాగంగా సరికొత్త తరహాలో స్టార్ హీరోలను ఏకం చేయబోతున్నాడు. ఒక సినిమా కథకు మరొక సినిమా కథ కనెక్షన్ ఉండేలా వండర్స్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాడు.

అయితే లోకేష్ టాలీవుడ్ స్టార్ హీరోలపై కూడా ఫోకస్ పెంచినట్లుగా ఆ మధ్యకాలంలోనే బలమైన టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు అతని పుట్టిన రోజు సందర్భంగా ఒక ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ప్రత్యేకంగా విషెస్ తెలపడంతో పాటు అతని కాంబినేషన్లో ఒక సినిమా చేయబోతున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ సంస్థ చేతిలో ప్రస్తుతం టాలీవుడ్ హీరోల కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి.

అందులో ముఖ్యంగా ప్రభాస్ ఎన్టీఆర్ లతో కూడా సినిమా చేయడానికి ఆ సంస్థ ఇదివరకే చర్చలు జరిపింది. ముఖ్యంగా ప్రభాస్ తో డేట్స్ కోసమైతే చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా కర్ణాటక వెళ్ళిన ప్రతిసారి అక్కడ KVN ప్రొడక్షన్ తో చర్చలు జరుపుతూ ఉన్నాడు. అంతేకాకుండా రామ్ చరణ్ తేజ్ తో కూడా ఆ నిర్మాతలు టచ్ లోనే ఉన్నారు.

అయితే ఈ ముగ్గురిలో లోకేష్ ఎవరితో ముందుగా సినిమా చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది. గతంలో అతను ప్రభాస్ ఎన్టీఆర్ లతో కూడా సినిమా చేయబోతున్నట్లుగా కొన్ని గాసిప్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ తో చేయాలని తనకు ఉంది అని కానీ ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు అని లోకేష్ తెలిపాడు. ఇక ఎన్టీఆర్ తో కూడా అతను సినిమా చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అయితే లోకేష్ కనగరాజ్ ఎన్టీఆర్ లేదా ప్రభాస్ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ విషయంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైన తర్వాత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.