Begin typing your search above and press return to search.

డోంట్ మిస్ ఫ‌స్ట్ 10 మినిట్స్ ఆఫ్ 'లియో'

విజ‌య్ ప‌రిచ‌య స‌న్నివేశాలు ఆ పది నిమిషాలు చూపిస్తారా? లేక లోకేష్ మార్క్ యూనివ‌ర్శ్ లోకి తీసుకెళ్ల‌బోతున్నారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

By:  Tupaki Desk   |   14 Oct 2023 2:52 PM GMT
డోంట్ మిస్ ఫ‌స్ట్  10 మినిట్స్ ఆఫ్  లియో
X

'లియో' కౌంట్ డౌన్ మొద‌లైంది. మ‌రో ఐదు రోజుల్లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ అంత‌కంత‌కు పెరిగిపోతుంది. కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియ‌లో ట్రెండింగ్ గా మారిన చిత్రమైంది. లోకేష క‌న‌గ‌రాజ్ యూనివ‌ర్శ్ నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో! భారీ హైప్ క్రియేట్ అవుతోంది. సినిమా ఎలా ఉండ‌బోతుంది? అన్న ఉత్కంఠ పెరిగిపోతుంది.

అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌చార చిత్రాలు అంత‌కంత‌కు హైప్ పెంచేసాయి. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం ఠారెత్తిపోతుంది. అమెరికాలో వినూత్న ర్యాలీలు ఆక‌ట్టుకుంటున్నాయి. విజ‌య్ అభిమానులు బైక్..కార్ల ర్యాలీతో ప్ర‌త్యేక‌మైన బ‌జ్ ని తీసుకొస్తున్నారు. అలాగే కేర‌ళ‌లోనూ అభిమానులు ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమాపై ద‌ర్శ‌కుడు లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

'లియో కోసం 1000కంటే ఎక్కువ మంది ప‌నిచేసారు. ఏడాది పాటు వాళ్లంతా రేయింబ‌వ‌ళ్లు ప‌నిచేసారు. అధ్బుత‌మైన ఔట్ ఫుట్ వ‌చ్చింది. ఎప్పుడూ చూడ‌ని సినిమాటిక్ అనుభ‌వాన్ని లియోలో ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా మొద‌టి ప‌ది నిమిషాలు అస్స‌లు మిస్ అవ్వొద్దు. సినిమాలో ఆ ప‌ది నిమిషాలు ఎంతో కీల‌కం' అన్నారు . దీంతో ఆ ప‌ది నిమిషాల్లో క‌న‌గ‌రాజ్ ఏం చెప్ప‌బోతున్నాడు? అన్న ఆస‌క్తి రెట్టింపు అవుతుంది.

విజ‌య్ ప‌రిచ‌య స‌న్నివేశాలు ఆ పది నిమిషాలు చూపిస్తారా? లేక లోకేష్ మార్క్ యూనివ‌ర్శ్ లోకి తీసుకెళ్ల‌బోతున్నారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో క‌థ‌ని న‌డ‌పడం లొకేష్ ప్ర‌త్యేక‌త‌. వాట్ నెక్స్ట్ అనే ఓ ఎగ్జైట్ మెంట్ తీసుకొస్తాడు...ఆర్ ఆర్ ఆర్ తో ప్రేక్ష‌కుల‌కు కొత్త ఫీల్ ని అందించ‌డం అత‌ని ప్ర‌త్యేక‌త‌. మ‌రి 'లియో'లో ఆ ప‌ది నిమిషాలు ఏం చెప్ప‌బోతున్నాడో ? చూడాలి. ఈ చిత్రం అక్టోబ‌ర్ 19న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. సంజ‌య్ ద‌త్..అర్జున్...గౌత‌మ్ మీన‌న్..మిస్కిన్ లాంటి వారు లియో లో కీల‌క పాత్ర‌లు పోషించ‌డం ఇంట్రెస్టింగ్.