Begin typing your search above and press return to search.

LCU లో LEO భాగ‌మేనా కాదా?

ద‌ళ‌ప‌తి విజయ్ ప్రధాన పాత్రలో లియో అనే భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని అత‌డు తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Oct 2023 4:15 PM GMT
LCU లో LEO భాగ‌మేనా కాదా?
X

లోకేశ్ కనగరాజ్.. ఈ పేరే ఒక సంచ‌ల‌నం. లోకేశ్ కనగరాజ్ ఒకదాని తర్వాత ఒకటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందిస్తూ అత్యంత విజయవంతమైన దర్శకులలో ఒకరిగా ఎదిగారు. ప్రతిభావంతుడైన‌ సౌతిండియ‌న్ ద‌ర్శ‌కుడిగా అత‌డికి జాతీయ స్థాయిలో క్రేజ్ నెల‌కొంది. ద‌ళ‌ప‌తి విజయ్ ప్రధాన పాత్రలో లియో అనే భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని అత‌డు తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. లియో రిలీజ్ కి ఇప్ప‌టికే కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది.

ఈ చిత్రం థియేట్రికల్ గా అత్యంత భారీగా విడుద‌ల కానుంది. ఇంతలో లియోలో LCU (లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్శ్) కనెక్ట్‌పై లోకేష్ కనగరాజ్ ఒక ముఖ్యమైన విష‌యాన్ని బహిర్గతం చేశారు. లోకేష్ తెరకెక్కించిన‌ కైతి -విక్రమ్ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ విక్ర‌మ్ తో లోకేష్ ట్యాలెంట్ ఎలాంటిదో లోకానికి పూర్తిగా తెలిసింది.

త‌న సినిమాల్లో భారీ తారాగ‌ణాన్ని చేర్చుకోవ‌డం ద్వారా సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్‌ను కూడా సెట్ చేశాడు. విక్ర‌మ్ ఎల్.సి.యులో ఒక భాగం. లోకేష్ కనగరాజ్ విజయ్‌తో 'లియో'ని అత్యంత భారీగా తెర‌కెక్కించాడు. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి అభిమానులు ఒక ప్ర‌త్యేక‌ కోణంలో దీనిని చూస్తున్నారు. 'లోకేష్ క‌న‌గ‌రాజ్ యూనివ‌ర్శ్'లో లియో ఒక భాగం అని భావిస్తున్నారు.

'లియో' LCUలో భాగమవుతుందా లేదా అనేదానిపైనా చ‌ర్చ ఇటీవ‌ల‌ మ‌రింత విస్త్ర‌త‌మైంది. 'లియో' బిగ్ స్క్రీన్ విడుదల కోసం లోకేష్ కనగరాజ్ వేచి చూస్తున్నారు. అందువ‌ల్ల‌నే ఎల్‌సియు గురించిన ప్ర‌చారంపై ఇప్పటివరకు మౌనంగా ఉన్నారు. అయితే ఎట్టకేలకు 'లియో'లో LCU కనెక్షన్‌ల గురించి హింట్ ఇచ్చాడు.ఇటీవలి యూట్యూబ్ ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ LCUపై తన అభిప్రాయాన్ని తెలిపాడు.

అత‌డు అభిమానులను నిరాశపరచకూడదని వ్యాఖ్యానించాడు. త‌ద్వారా తాను భ‌విష్య‌త్ లో ఎలాంటి సినిమాలు తీస్తాడో రివీలైంది. లియోని ఎల్‌సియు విశ్వానికి కనెక్ట్ చేసే విష‌యాన్ని పూర్తి క్లారిటీగా చెప్ప‌క‌పోయినా హింట్ అయితే వ‌దిలాడు. అతడు తన సినీ విశ్వంలో ఇప్పటివరకు రెండు చిత్రాలను మాత్రమే అందించాడు. సినిమా యూనివర్స్ ట్రెండ్‌కి అనుగుణంగా మూడవ చిత్రం ఎప్పుడు రిలీజ‌వుతుందో కూడా అతడికి ఇంకా క్లారిటీ లేదు.

LCU పై ఇంకా పని జ‌రుగుతోంది. లోకేష్ ఇప్ప‌టికి తొందరపడటం ఇష్టం లేదు. అతడు 'లియో'ను LCUలో భాగం చేసే అవకాశాలపై ఇప్ప‌టికే త‌న హీరో ద‌ళ‌ప‌తి విజయ్‌తో చర్చించాడు. ఎల్.సి.యు అంటే లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించే భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ల యూనివ‌ర్శ్. ఇందులో లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌లతో పాన్ ఇండియ‌న్ సినిమాలు తెర‌కెక్క‌నున్నాయి. ఇందులో త‌న సినిమాల్లోని లీడ్ పాత్ర‌లన్నిటినీ త‌దుప‌రి ఫ్రాంఛైజీ చిత్రాల్లో చూపించే వీలుంటుంది.

లియో అక్టోబర్ 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. తమిళనాడు స‌హా భారతదేశంలోని ఇతర లొకేషన్‌లలో ఈ చిత్రానికి సంబంధించిన బుకింగులు త్వరలో తెరుచుకుంటాయి.