Begin typing your search above and press return to search.

సంచ‌ల‌న కాంబినేష‌న్ రెడీ అవుతోందా?

'ఖైదీ'..'విక్ర‌మ్'..'లియో' లాంటి విజ‌యాల‌తో కోలీవుడ్ స్టార మేక‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ పేరు పాన్ ఇండియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిందో తెలిసిందే

By:  Tupaki Desk   |   24 March 2024 6:19 AM GMT
సంచ‌ల‌న కాంబినేష‌న్ రెడీ అవుతోందా?
X

'ఖైదీ'..'విక్ర‌మ్'..'లియో' లాంటి విజ‌యాల‌తో కోలీవుడ్ స్టార మేక‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ పేరు పాన్ ఇండియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిందో తెలిసిందే. వ‌రుస‌గా మూడు విజ‌యాలు లొకేష్ ని అగ్ర స్థానంలో నిలబెట్టాయి. 'ఖైదీ' లో కార్తీ..'విక్ర‌మ్' లో క‌మ‌ల్ హాస‌న్..'లియో'లో విజ‌య్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. లోకేష్ రాసుకున్న క‌థ‌..పాత్ర‌లు అంత గొప్ప‌గా పండాయి అంటే? కారణం ఆయా న‌టుల‌తోనే సాధ్య‌మ‌న్న‌ది వాస్త‌వం.

మ‌రి అంత‌టి ట్యాలెంటెడ్ లోకేష్ కి చియాన్ విక్ర‌మ్ లాంటి న‌టుడు తోడైతే? ఎలా ఉంటుంది? ఓసారి ఊహించండి. అది ఊహ‌కు కూడా అంద‌ని విధంగా ఉంటుంది అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. మ‌రి ఇప్పుడు ఆకాంబినేష‌న్ కి స‌మ‌యం ఆస‌న్న‌మైందా? లోకేష్ అప‌రిచితుడిని త‌ట్టి లేపుతున్నాడా? అంటే అవున‌నే అంటున్నాయి కోలీవుడ్ వ‌ర్గాలు. విక్ర‌మ్ కోసం లోకేష్ అదిరిపోయే ఓ స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడ‌ని తాజా స‌మాచారం.

అంది ఎంతో యూనిక్ గా ఉంటుంద‌ని..ఇంత‌వ‌ర‌కూ ఏ ఇండియ‌న్ మేక‌ర్ అలాంటి స్క్రిప్ట్ డైరెక్ట్ చేయ‌లే ద‌ని....విక్ర‌మ్ అసాధార‌ణ న‌ట‌న‌కే అందులో పాత్ర ఓ ప‌రీక్ష లా ఉంటుంద‌ని అంటున్నారు. లొకేష్ మార్క్ యూనివ‌ర్శ్ ఫీల్ తీసుకొస్తుందిట‌. అండర కరెంట్ గా డ్ర‌గ్ మాఫియా నేప‌థ్యాన్ని హైలైట్ చేస్తూనే ఓ కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లే స‌రికొత్త స్టోరీ ఇది అని కోలీవుడ్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇదే నిజ‌మైతే ఆ కాంబినేష‌న్ సంచ‌ల‌నం అవుతుంది? అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

లోకేష్ లాంటి వాడికి..విక్ర‌మ్ లాంటి పెర్పార్మ‌ర్ దొరికితే విశ్వ‌రూప‌మే క‌దా. అయితే అందుకు స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌స్తుతం లోకేష్ క‌న‌గరాజ్ ర‌జ‌నీకాంత్ 171వ చిత్రానికి సంబంధించిన ప‌నుల్లో ఉన్నాడు. అతి త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్త‌వుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్న దానిపై స‌రైన క్లారిటీ లేదు. ఈ ప్రాజెక్ట్ త‌ర్వాత‌నే విక్ర‌మ్ సినిమాపై అధికారికంగా తెలిసే అవ‌కాశం ఉంది.