Begin typing your search above and press return to search.

లోకేష్ కనగరాజ్.. మళ్ళీ ట్విస్ట్ ఏంటి?

ఇదిలా ఉంటే తాజా లోకేష్ ఓ మీడియా సమావేశంలో లియో సీక్వెల్ పై స్పష్టత ఇచ్చారు. విలేకరి అడిగిన ప్రశ్నకి క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 4:07 AM GMT
లోకేష్ కనగరాజ్.. మళ్ళీ ట్విస్ట్ ఏంటి?
X

సినిమాటిక్ యూనివర్స్ లో వరుసగా స్టార్ హీరోలతో మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో సినిమాలు చేస్తోన్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. గత ఏడాది లియో మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమాకి రెడీ అవుతున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ చిత్రంగా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ తాను చేసే ప్రతి సినిమాకి సీక్వెల్ కూడా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.

అలాగే గత ఏడాది ఇళయదళపతి విజయ్ తో చేసిన సినిమాకి సీక్వెల్ కన్ఫర్మ్ చేశారు. దానికి లీడ్ కూడా ఇచ్చారు. అయితే దళపతి విజయ్ సడెన్ గా రాజకీయ పార్టీ పెట్టారు. ప్రత్యక్షరాజకీయాలలోకి వెళ్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. సినిమాలు పూర్తిగా వదిలేస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు. దీంతో లియో సీక్వెల్ ఇక ఉండే అవకాశం లేదని అభిమానులు డిసైడ్ అయిపోయారు. లియో సీక్వెల్ పై పబ్లిక్ నుంచి పెద్దగా ఇంటరెస్ట్ రాలేదు.

దానికి కారణం లియో మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడమే అని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజా లోకేష్ ఓ మీడియా సమావేశంలో లియో సీక్వెల్ పై స్పష్టత ఇచ్చారు. విలేకరి అడిగిన ప్రశ్నకి క్లారిటీ ఇచ్చారు. లియో సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని, అయితే దానికి సమయం పడుతుందని చెప్పాడు. ప్రస్తుతం విజయ్ ఆలోచనలు వేరే మార్గంలో ఉన్నాయని, అతనికి సక్సెస్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

లియో సీక్వెల్ ని లోకేష్ కన్ఫర్మ్ చేయడంతో భవిష్యత్తులో కచ్చితంగా విజయ్ రీఎంట్రీ ఉంటుందని అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లోకేష్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలకి సంబందించిన సీక్వెల్స్ కంప్లీట్ చేసేసరికి కనీసం ఆరేళ్ళు పడుతుంది. ఆ తరువాత ఏమైనా విజయ్ లియో సీక్వెల్ ని తెరపైకి తీసుకొని వస్తాడా అనేది తెలియాల్సి ఉంది. విజయ్ తనయుడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు.

భవిష్యత్తులో లియో సీక్వెల్ విజయ్ తో కుదరకపోతే అతని కొడుకుతో లోకేష్ ఏమైనా ప్లాన్ చేస్తాడేమో అని వేచి చూడాలి. ఏది ఏమైన విజయ్ సినిమాలు మానేస్తానని చెప్పిన తర్వాత లోకేష్ లియో సీక్వెల్ ఉంటుందని చెప్పడం మాత్రం అభిమానులలో కొత్త ఆశలని రేకెత్తించింది.