Begin typing your search above and press return to search.

#G-స్క్వాడ్.. ఇదేనా క‌న‌గ‌రాజ్ ప్ర‌యోగ‌శాల‌?

ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన పాపుల‌ర్ త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ 'లియో'తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించాడు

By:  Tupaki Desk   |   27 Nov 2023 3:28 PM GMT
#G-స్క్వాడ్.. ఇదేనా క‌న‌గ‌రాజ్ ప్ర‌యోగ‌శాల‌?
X

ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన పాపుల‌ర్ త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ 'లియో'తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించాడు. ఇంత‌లోనే ఇప్పుడు తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అతడు తన నిర్మాణ సంస్థ‌కు 'G-స్క్వాడ్' అని పేరు పెట్టాడు. దానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న‌ను జారీ చేశాడు.


ఆ నోట్‌లో ఇలా ఉంది, ''నమస్కారాలు.. 5 చిత్రాలకు దర్శకత్వం వహించిన తర్వాత, కథ చెప్పడం ..వినోదం తాలూకా అంద‌మైన‌ ప్రకృతి దృశ్యాన్ని పునర్నిర్వచించటానికి అంకితమైన నా నిర్మాణ సంస్థ‌ - G స్క్వాడ్‌ను ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాను'' అని అన్నాడు. ''మొదటి కొన్ని ప్రొడక్షన్‌లలో నా సన్నిహితులు, సహాయకులు వారి సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడానికి పని చేస్తాను. మీరంతా ఇప్పటివరకు నాకు అందించిన మద్దతును ఈ సంస్థ‌కు కూడా అందించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను'' అన్నారు. ముగింపు నోట్‌లో వ్యాఖ్యానిస్తూ ''శాంతంగా ఉండండి .. మా మొదటి ప్రొడక్షన్ వెంచర్ అప్‌డేట్ కోసం వేచి ఉండండి... ప్రేమ‌తో లోకేశ్ కనగరాజ్'' అని వ్యాఖ్య‌ను జోడించాడు.

లోకేష్ కనగరాజ్ తమిళ చిత్రసీమలోనే కాకుండా దేశవ్యాప్తంగా పాపుల‌ర్ ప‌ర్స‌నాలిటీగా ఎదిగారు. ఇటీవల ద‌ళ‌పతి విజయ్ తో 'లియో' చిత్రం విజయం సాధించిన తరువాత, సూప‌ర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. తాత్కాలికంగా 'తలైవర్ 171' అనే పేరును నిర్ణ‌యించారు. ఈ చిత్రం షూటింగ్ మార్చి లేదా ఏప్రిల్ 2024లో ప్రారంభం కానుంది. ఇందులో రాఘవ లారెన్స్ ప్రతినాయకుడి పాత్రను పోషించే అవకాశం ఉందని గుసగుస‌లు వినిపిస్తున్నాయి.

తలైవర్ 171 తర్వాత లోకేష్ కనగరాజ్ కార్తీతో భారీ అంచనాలున్న 'ఖైది 2'కి దర్శకత్వం వహిస్తాడు. అతడు సూర్య పోషించిన రోలెక్స్ పాత్ర చుట్టూ ఒక స్వతంత్ర చిత్రం కోసం కూడా పని చేస్తున్నాడు. దీని తరువాత, కనగరాజ్ కమల్ హాసన్‌తో 'విక్రమ్ 2' తెర‌కెక్కిస్తాడు. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) ముగింపు అవుతుంద‌ని స‌మాచారం. విజ‌య్ తో 'లియో 2' కూడా తెర‌కెక్కే వీలుంది.