Begin typing your search above and press return to search.

ఆయ‌న‌ ఇంకెన్ని స‌ర్ ప్రైజ్ లు ప్లాన్ చేసాడో?

ఖైదీ-2..విక్ర‌మ్-2.. రోలెక్స్ చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. ఖైదీ..విక్ర‌మ్ ఒకే యూనివ‌ర్శ్ నుంచి వ‌స్తున్నాయి

By:  Tupaki Desk   |   9 Jan 2024 7:30 AM GMT
ఆయ‌న‌ ఇంకెన్ని స‌ర్ ప్రైజ్ లు ప్లాన్ చేసాడో?
X

లోకేష్ క‌న‌గరాజ్ సినిమాటిక్ యూనివ‌ర్శ్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. త‌న యూనివ‌ర్శ్ నుంచి కాకుండా స‌ప‌రేట్ గా కొన్ని సినిమాలు కూడా ప్లాప్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఆ స్టోరీ ప‌నుల్లోనే బిజీగా ఉన్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసి వీలైనంత త్వ‌ర‌గా చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నాడు. మరోవైపు త‌న యూనివ‌ర్శ్ నుంచి రావాల్సిన చిత్రాలు కొన్ని ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఖైదీ-2..విక్ర‌మ్-2.. రోలెక్స్ చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. ఖైదీ..విక్ర‌మ్ ఒకే యూనివ‌ర్శ్ నుంచి వ‌స్తున్నాయి. అలేగే రోలెక్స్ అనేది అదే యూనివ‌ర్శ్ నుంచి క్రియేట్ అయినా ఆ పాత్ర‌నే తీసుకుని ప్ర‌త్యేకంగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తిగా మ‌రింత రా అండ్ ర‌స్టిక్ గా ఉండ‌బోతుంది. ఇవ‌న్నీ కాకుండా లియో-2 కూడా ఉంటుంద‌ని కొద్ది రోజులుగా ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.

విజ‌య్ తో తెర‌కెక్కించిన లియో భారీ విజ‌యం సాధించ‌డంతో కొన‌సాగింపు క‌థ కూడా ఉంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే అందులో వాస్త‌వం ఏంటి? అన్న‌ది ఇంత కాలం స‌రైన క్లారిటీ లేదు. తాజాగా లియో-2 ఉంటుంద‌నే విష‌యాన్ని లోకేష్ కన్ప‌మ్ చేసాడు. దీంతో సీక్వెల్ లో ఏం జ‌రుగుతుంది? విజ‌య్ ని ఎలా చూపించ‌బోతున్నాడు? అన్న ఉత్సాహం అభిమానుల్లో అప్పుడే మొద‌లైపోయింది.

ప‌ది సినిమాలు చేసి రిటైర్మెంట్ తీసేసుకుంటాను అన్న లొకేష్ నుంచి వ‌రుస‌గా ఇలా ప్రాజెక్ట్ లు తెర‌పైకి రావ‌డం అభిమానులకు స‌ర్ ప్రైజ్ గానే అనిపిస్తుంది. మ‌రి మును ముందు ఇలాంటి స‌ర్ ప్రైజ్ లు లొకేష్ ఇంకెన్నింటిని ప్లాన్ చేస్తున్నాడో? ఏమో! ఇప్ప‌టికే త‌న యూనివ‌ర్శ్ నుంచి రాబోతున్న క‌థ‌లు కొన్ని సిద్దం గానే రాసి పెట్టాడు. వాటిని కాస్త అప్ డేట్ చేస్తే స‌రి. సెట్స్ కి వెళ్లిపోవ‌చ్చు అన్న ధీమా లోకేష్ లో ఉంది. ఆ న‌మ్మ‌కంతోనే ఇలా వ‌రుస‌గా ప్రాజెక్ట్ లు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది.