Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ మూవీ సీక్వెల్‌ పై డైరెక్టర్ క్లారిటీ

ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ విజయ్ తో మళ్లీ కలిసి సినిమా చేసే ఆలోచనతో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు

By:  Tupaki Desk   |   28 Dec 2023 5:30 PM GMT
సూపర్‌ స్టార్‌ మూవీ సీక్వెల్‌ పై డైరెక్టర్ క్లారిటీ
X

తమిళ సూపర్ స్టార్‌ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొంది ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లియో' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళేతర భాషల్లో పెద్దగా సక్సెస్ అవ్వకున్నా కూడా తమిళ భాషలో మాత్రం భారీ వసూళ్లు రాబట్టిన లియో కి సీక్వెల్‌ విషయమై క్లారిటీ వచ్చింది.

ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ విజయ్ తో మళ్లీ కలిసి సినిమా చేసే ఆలోచనతో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అది లియో కి సీక్వెల్‌ గా ఉంటుందని కూడా పేర్కొన్నాడు. ఇప్పటికే లియో 2 కి సంబంధించిన స్టోరీ లైన్ రెడీగా ఉందని పేర్కొన్నాడు.

లియో 2 సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ కన్ఫర్మ్‌ చేశాడు. అయితే రజినీకాంత్‌ సినిమా, ఖైదీ సీక్వెల్‌, విక్రమ్‌ సీక్వెల్‌ లు పూర్తి అయిన తర్వాత మాత్రమే లియో 2 ఉంటుందని ఆయన ప్రకటించాడు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ప్రస్తుతం విజయ్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

వెంకట్‌ ప్రభు సినిమా తర్వాత విజయ్ మరి కొన్ని కమిట్‌మెంట్స్ ను కలిగి ఉన్నాడు. వాటిని పూర్తి చేసిన తర్వాత లియో 2 సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ తమిళ్‌ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

లోకేష్ తాను చేసిన ప్రతి సినిమాను కూడా రెండో భాగం ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకే ప్రస్తుతం రజినీకాంత్‌ తో ఆయన చేసేందుకు రెడీ అవుతున్న సినిమా కు కూడా సీక్వెల్‌ ఉండే అవకాశాలు ఉంటాయి అన్నట్టు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.