Begin typing your search above and press return to search.

టార్గెట్ సెట్.. ఆ స్పిడేంటయ్యా లోకేష్!

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా డిఫరెంట్ కథలని ఒకే ప్లాట్ ఫామ్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం లోకేష్ చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   11 Sep 2023 5:00 AM GMT
టార్గెట్ సెట్.. ఆ స్పిడేంటయ్యా లోకేష్!
X

కోలీవుడ్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో వరుస సక్సెస్ లు అందుకుంటున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా డిఫరెంట్ కథలని ఒకే ప్లాట్ ఫామ్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం లోకేష్ చేస్తున్నాడు. అందులో ఖైదీ, విక్రమ్ సినిమాలకి కొనసాగింపుగా ఇళయదళపతి విజయ్ తో లియో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా దసరాకి రిలీజ్ కానుంది.

పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. దీని తర్వాత లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. ఇప్పటికే స్టోరీ నేరేషన్ కూడా అయిపొయింది. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ చిత్రం కూడా తెరకెక్కనుంది. జైలర్ మూవీతో చాలా ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజినీకాంత్ కూడా లోకేష్ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాపై కోలీవుడ్ సర్కిల్ లో ఇంటరెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మూవీ ప్రారంభించకుండానే లోకేష్ కనగరాజ్ రిలీజ్ డేట్ కూడా నిర్ణయించేసాడంట. వచ్చే ఏడాది దీపావళి కానుకగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడంట. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాని ప్రారంభించి వీలైనంత వేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారంట.

కోలీవుడ్ అత్యంత వేగంగా సినిమాని కంప్లీట్ చేసే దర్శకుడిగా లోకేష్ ఉన్నాడు. కేవలం 6 నెలల్లోనే మూవీ కంప్లీట్ చేయడంతో పాటు రిలీజ్ కూడా చేసేస్తాడు. ఈ కారణంగా స్టార్ హీరోలు అతనితో మూవీస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇతర దర్శకులు స్టార్ హీరోతో మూవీ అంటే కనీసం ఏడాది సమయం తీసుకుంటారు. కానీ లోకేష్ ఆరు నెలల్లో ఫినిష్ చేసేస్తున్నాడు.

విజయ్ లియో మూవీ రిలీజ్ అయిన వెంటనే సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నాడంట. ఈ ఏడాది ఆఖరులో లేదంటే వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.