Begin typing your search above and press return to search.

లోకేష్ బోర్ కొట్టేశాడా..?

ఐతే అన్ని సినిమాలు విక్రం లు కాలేవు. అదీగాక కూలీ టీజర్ చూశాక లోకేష్ ఒకే తరహా టేకింగ్ ఆడియన్స్ కు బోర్ కొట్టేసిందని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   26 April 2024 8:01 AM GMT
లోకేష్ బోర్ కొట్టేశాడా..?
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమాతో సత్తా చాటగా ఆ తర్వాత దళపతి విజయ్ తో మాస్టర్ సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు. లోకనాయకుడు కమల్ హాసన్ తో చేసిన విక్రం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు లోకేష్. విక్రంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక ట్రెడ్ క్రియేట్ చేశాడు. విక్రం తర్వాత మరోసారి దళపతి విజయ్ తో లియో సినిమా చేసిన లోకేష్ ఆ సినిమాతో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. కోలీవుడ్ లో విజయ్ ఎలాంటి సినిమా చేసినా బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు కాబట్టి లియో కమర్షియల్ గా హిట్ అయినా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ రేంజ్ అందుకోలేదు.

ప్రస్తుతం లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక టీజర్ రిలీజ్ కాగా అందులో ఒకప్పటి రజిని డైలాగ్ నే వాడేశారు. లోకేష్ విక్రం సినిమా తరహాలోనే కూలీ సినిమాను తెరకెక్కిస్తున్నాడని చెప్పొచ్చు. ఐతే అన్ని సినిమాలు విక్రం లు కాలేవు. అదీగాక కూలీ టీజర్ చూశాక లోకేష్ ఒకే తరహా టేకింగ్ ఆడియన్స్ కు బోర్ కొట్టేసిందని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.

రజినితో లోకేష్ సినిమా అనగానే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకోవాలంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండాల్సిందే. అలా కాకుండా రొటీన్ రెగ్యులర్ రివెంజ్ డ్రామా అయితే మాత్రం రిజల్ట్ తేడా కొట్టే అవకాశం ఉంటుంది. జైలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రజిని లోకేష్ సినిమా అంతకుమించి ఉండేలా చూడాలి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా కూలీని నెవర్ బిఫోర్ అనిపించేలా చూస్తున్నారు.

లోకేష్ వదిలిన టీజర్ చూస్తే మాత్రం రొటీన్ గానే అనిపించింది. మరి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ డైరెక్టర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ రజిని సినిమా లోకేష్ రేంజ్ ఏంటో ప్రూవ్ చేస్తుందా లేదా సినిమా వస్తేనే చెప్పగలం. రజిని ప్రస్తుతం వేటయ్య సినిమా చేస్తున్నాడు. లోకేష్ తో చేస్తున్న కూలీ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తుంది. లోకేష్ డైరెక్షన్ లో కార్తీ తో ఖైదీ 2 కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సూర్యతో రోలెక్స్ అనే సినిమా కూడా లైన్ లో ఉంది. మరి ఈ సినిమాలు రావాలంటే లోకేష్ సక్సెస్ ట్రాక్ కొనసాగించాల్సిందే.