Begin typing your search above and press return to search.

30 రోజుల్లోనే ఖైదీ-2..క్లారిటీ ఇచ్చేసిన లోకేష్‌!

ఖైదీ-2` ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంద‌ని అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 March 2024 7:03 AM GMT
30 రోజుల్లోనే ఖైదీ-2..క్లారిటీ ఇచ్చేసిన లోకేష్‌!
X

ఖైదీ-2` ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంద‌ని అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న సంగ‌తి తెలిసిందే. లొకేష్ క‌న‌గ‌రాజ్ ఇత‌ర స్టార్ల‌తోనూ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు? అలాంట‌ప్ప‌డు `ఖైదీ -2` ఇప్ప‌ట్లో సాధ్య‌మేనా? అస‌లు క‌థ రెడీ అయిందా? ఎప్పుడు ప్రారంభమ‌వుతుంది? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వంటి ఎన్నో సందేహాలున్నాయి. తాజాగా వాట‌న్నింటిపై లోకేష్ మాట‌ల్ని బ‌ట్టి క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లే. ప్ర‌స్తుతం లోక‌ష్ క‌ర‌గ‌రాజ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 171వ చిత్రం ప‌నుల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ర‌జ‌నీ 170వ సినిమా సెట్స్ లో ఉంది. అది పూర్తికాగానే లోకేష్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుంది. ఇది ఆరు నెల‌లైనా సెట్స్ లో ఉండే అవావకాశం ఉంది. అటుపై పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు ఓ రెండు నెల‌లు స‌మయం ప‌డు తుంది. అయితే 171వ సినిమా షూటింగ్ పూర్త‌యిన నెల రోజుల్లోనే ఖైదీ-2 షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని లొకేష్ క‌న‌గ‌రాజ్ తాజాగా ప్ర‌క‌టించాడు. చిత్రీక‌ర‌ణ పూర్త‌వ్వ‌డ‌మే ఆల‌స్యం `ఖైదీ-2` ఇంకెంత మాత్రం ఆల‌స్యం కాద‌ని తెలిపాడు. దీంతో లొకేష్ త‌దుప‌రి సినిమాపై ఓ క్లారిటీ దొరికేసింది.

`లియో -2` కూడా ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ముందుగా ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుంద‌ని అంతా భావించారు. విజయ్ కూడా రాజ‌కీయాల్లోకి వెళ్తున్న త‌రుణంలో వీలైనంత త్వ‌ర‌గా `లియో-2` పూర్తి చేసి అత‌డిని పంపిచే ప్రక్రియ‌లో భాగంగా ఆసినిమానే ప్రారంభం అవుతుంద‌ని చాలా మంది అంచ‌నా వేసా రు. అలాగే సూర్య హీరోగా `రోలెక్స్` టైటిల్ తోనూ ఓ సినిమా ప్ర‌క‌టించారు. ఈ సినిమా కూడా వీలైనంత త్వ‌ర‌గా తీసుకురావాల‌ని అభిమానుల నుంచి ఒత్తిడి ఉంది.

ఇలా ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో `ఖైదీ-2` ఇప్ప‌ట్లో సాధ్య‌మైనా? అనిపించింది. కానీ క‌న‌గ‌రాజ్ మాత్రం `ఖైదీ-2` కే మొద‌టి ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఖైదీ మొద‌టి భాగం నుంచి క‌థ మొద‌ల వుతుంది కాబ‌ట్టి `ఖైదీ -2` లో కార్తీనే హీరోగా న‌టిస్తాడు. అద‌నంగా కొత్త పాత్రాలు యాడ్ అవుతాయి. ఈ క‌థ‌కి విక్ర‌మ్ కి లింక్ ఎలా ఉంటుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఇవ‌న్నీ లొకేష్ యూనిర్శ్ నుంచి వ‌స్తోన్న చిత్రాలు అన్న సంగ‌తి గుర్తించాలి.