Begin typing your search above and press return to search.

లోకేష్ నీవు కూడా కాపీ క్యాట్‌వేనా..!

ఆ యూనివర్స్‌ లో ఎన్నో సినిమాలు వస్తాయి అంటూ ఇప్పటికే లోకేష్ కనగరాజ్ ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 10:30 AM GMT
లోకేష్ నీవు కూడా కాపీ క్యాట్‌వేనా..!
X

ఈ మధ్య కాలంలో సౌత్‌ లో అత్యధికంగా వినిపిస్తున్న పేర్లలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖైదీ, మాస్టర్, విక్రమ్‌, లియో ఇలా ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

కమర్షియల్‌ విజయాలను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ఒక సినిమాటిక్ యూనివర్స్‌ ను క్రియేట్‌ చేయడంలో లోకేష్ కనగరాజ్ సఫలం అయ్యాడు. ఆ యూనివర్స్‌ లో ఎన్నో సినిమాలు వస్తాయి అంటూ ఇప్పటికే లోకేష్ కనగరాజ్ ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ తో ఒక సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదే సమయంలో కమల్ తో చేయబోతున్న విక్రమ్‌ సీక్వెల్‌ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడు. మరో వైపు ఖైదీ సీక్వెల్‌ ను ప్లాన్‌ చేస్తున్నాడు.

ఇన్ని సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్న లోకేష్ కనగరాజ్ పై కాపీ ముద్ర పడింది. విజయ్ తో ఈయన మూడు సంవత్సరాల క్రితం రూపొందించిన మాస్టర్ సినిమా మలయాళ మూవీ ముద్ర కి కాపీ అంటూ చాలా మంది నెటిజన్లు సాక్ష్యం తో సహా నిరూపిస్తూ ఉన్నారు.

ముద్ర సినిమాలో బాల నేరస్థుల జైలుకు సూపర్‌ వైజర్ గా ఉండే హీరో అక్కడ జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తాడు. ముద్ర లోని చాలా సన్నివేశాలను మక్కీకి మక్కీ అన్నట్లుగా మనోడు మాస్టర్ లో దించేశాడు. అంతే కాకుండా మరికొన్ని సినిమాలకు సంబంధించిన సన్నివేశాలను కూడా లోకేష్ వాడేశాడు అంటూ ఇప్పుడు నెట్టింట విమర్శలు వస్తున్నాయి.

మొత్తానికి ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనుకున్న లోకేష్ కనగరాజ్ కూడా కాపీ క్యాట్‌ అంటూ వస్తున్న విమర్శలు ఆయన ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు. అయితే చాలా స్పష్టంగా ఆ విషయాన్ని సోషల్ మీడియాలో కొందరు నిరూపిస్తూ వీడియోలు పక్క పక్కన పెట్టి నిరూపిస్తున్నారు. కాపీ విమర్శలకు లోకేష్ కనగరాజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.