బెంజ్+ కూలీ LCU-2 నా? ఇదేం ట్విస్ట్!
కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎల్ సీయూ పాన్ ఇండియాలో ఎంత సంచలనంమైందో తెలిసిందే.
By: Tupaki Desk | 15 Jun 2025 2:00 PM ISTకోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎల్ సీయూ పాన్ ఇండియాలో ఎంత సంచలనంమైందో తెలిసిందే. మరో ఐదు సంవత్సరాల పాటు ఇదే యూనివర్శ్ లో లోకేష్ సినిమాలన్నీ ఉంటాయి. మధ్యలో ఇతర హీరోలతో సినిమాలు చేసినా? అది సపరేట్ ప్రాజెక్ట్ అవుతుంది. తన యూనివర్శ్ కి సంబంధం లేకుండా ఉంటుందని ముందే ప్రకటించారు. రజనీకాంత్ తో తెరకెక్కిస్తోన్న `కూలీ` విషయంలో ఇదే సందేహం తెరపైకి రావడంతో ఆ యూనివర్శ్ తో సంబంధం లేని చిత్రమని ప్రకటించడంతో క్లారిటీ వచ్చింది.
అయితే లోకేష్ తన యూనివర్శ్ నుంచే కాకుండా స్వయంగా కథలు రాసి తన శిష్యులతోనో..ఇతర డైరెక్ట ర్లతో వాటిని డైరెక్ట్ కూడా చేయిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ లో ఉన్న `బెంజ్` అలాంటి ప్రాజెక్ట్. లారెన్స్, నివిన్ పౌలీ ప్రధాన పాత్రల్లో బక్కియరాజ్ కన్నన బెంజ్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది.
ఈ నేపథ్యంలో తాజాగా `బెంజ్`-`కూలీ` చిత్రాల గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. ఈ రెండు చిత్రాలతో లోకేష్ మరో యూనివర్శ్ ని క్రియేట్ చేస్తున్నట్లు నెట్టింట సందేహం వ్యక్తమవుతోంది. `కూలీ` కి రిలేటెడ్ గా బెంజ్ కథ ఉంటుందనే అంశం తెరపైకి వస్తుంది. ముందుగా `కూలీ` రిలీజ్ అయిన తర్వాతే బెంజ్ రిలీజ్ అవుతుంది. బెంజ్ రిలీజ్ కి కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా కూలీ రిలీజ్ అయిన రెండు..మూడు నెలల వ్యవధిలోనే రిలీజ్ చేసేలా ప్రణాళిక సిద్దమవుతున్నట్లు కొన్ని లీకులందు తున్నాయి.
ఎల్ సీ యూ-2 లోకి ఈ రెండు చిత్రాలు వస్తాయని...రిలీజ్ అనంతరం వాటికి కొనసాగింపు కథలుంటాయని నెటి జనులు అభిప్రాయపడుతున్నారు. `కూలీ` అన్నది స్వతంత్ర చిత్రమని లోకేష్ ప్రకటించినా? ఈ సందేహాలు రావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. మేకర్స్ ధృవీ కరించే వరకూ వాటిని నమ్మడానికి వీలు లేదు.
