Begin typing your search above and press return to search.

హీరో హెల్త్ అప్డేట్.. లోకేష్ కనగరాజ్ కీలక స్టేట్మెంట్!

హీరో ఫ్యామిలీ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో నటరాజన్ ఉన్నట్లు లోకేష్ తెలిపారు.

By:  Tupaki Desk   |   19 April 2025 3:00 AM IST
హీరో హెల్త్ అప్డేట్.. లోకేష్ కనగరాజ్ కీలక స్టేట్మెంట్!
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. మా నగరం మూవీతో డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో నటుడు సందీప్ కిషన్ తో పాటు శ్రీ నటరాజన్ కూడా హీరోగా నటించారు. అయితే నటరాజన్ ఆరోగ్య పరిస్థితి గురించి కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో ఇప్పుడు నటరాజన్ హెల్త్ కు సంబంధించి పోస్ట్ పెట్టారు లోకేష్ కనగరాజ్. హీరో ఫ్యామిలీ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో నటరాజన్ ఉన్నట్లు లోకేష్ తెలిపారు. అయితే కొన్ని తప్పుడు వార్తల వల్ల తాము ఎంతో బాధపడుతున్నామని నటరాజన్ ఫ్యామిలీ స్టేట్మెంట్ లో తెలిపింది. ఆవేదన కూడా వ్యక్తం చేసింది!

"నటరాజన్ హెల్త్ గురించి ఆందోళన చెందుతున్న వారికి మా విన్నపం. వైద్యుల సజెషన్ వల్ల కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. ఎవరూ కూడా మా ఫ్యామిలీ ప్రైవసీ మాత్రం భంగం కలిగించవద్దు. నటరాజన్ హెల్త్ పై తప్పుడు వార్తలు క్రియేట్ చేయవద్దు" అని నటరాజన్ ఫ్యామిలీ తెలిపింది.

ఇప్పటికే కొన్ని కథనాలు చూసి తాము చాలా బాధపడ్డామని చెప్పింది. వాటని ఎవరూ స్ప్రెడ్ చేయొద్దని కోరింది. నటరాజన్ ఆరోగ్య పరిస్థితి గురించి అభ్యంతరకరంగా ఇప్పటికే ఎవరైనా వీడియోలు, ఇంటర్వ్యూలు షేర్‌ చేసి ఉంటే మాత్రం వాటిని డిలీట్ చేయండని కోరింది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే చెన్నైకు చెందిన శ్రీ నటరాజ్.. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ స్టార్టింగ్ లో పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు. ఆ తర్వాత వళక్కు 18/9 మూవీతో హీరోగా మారారు. డెబ్యూతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత సోన్‌ పాపిడి, విల్‌ అంబు, మా నగరం వంటి పలు చిత్రాల్లో నటించారు.

2017లో బిగ్ బాస్ సీజన్ లో పాల్గొని హౌస్ లోకి వెళ్లారు. కానీ నాలుగు రోజులకే షో నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో కొన్ని అభ్యంతకర వీడియోస్ షేర్ చేశారు. అందులో నటరాజన్ కాస్త గుర్తుపట్టలేనంతగా కనిపించారు. దీంతో అతడి మానసిక, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన హెల్త్ కోసం మళ్లీ చర్చలు జరగ్గా.. ఫ్యామిలీ రెస్పాండ్ అయ్యి రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ను లోకేష్ కనగరాజ్ షేర్ చేశారు.