ఆ సంచలనం టాలీవుడ్ కి ఇప్పట్లో రానట్లే!
కోలీవుడ్ డైరెక్టర్లు తెలుగులోనూ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రేట్ శంకర్ `గేమ్ ఛేంజర్` తో లాంచ్ అయ్యారు.
By: Tupaki Desk | 6 May 2025 5:00 AM ISTకోలీవుడ్ డైరెక్టర్లు తెలుగులోనూ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రేట్ శంకర్ `గేమ్ ఛేంజర్` తో లాంచ్ అయ్యారు. బన్నీ 22వ చిత్రంతో పాన్ ఇండియా సంచలనం అట్లీ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే అట్లీ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి తాకుతుంది. ఆ రేంజ్ లో బన్నీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే వీళ్లిద్దరి కంటే ముందుగానే మరో కోలీవుడ్ సంచలనం లోకేష్ కనగరాజ్ తెలుగులో సినిమా చేయాలి.
కానీ అది ఇంతవరకూ సాధ్యపడలేదు. `విక్రమ్` రిలీజ్ అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది. కానీ అది సాధ్యపడలేదు. తదుపరి `లియో` కూడా రిలీజ్ అయింది గానీ చరణ్ తో సినిమా జరగలేదు. మరి లోకేష్ టాలీవుడ్ లో ఎప్పుడు సినిమా చేస్తాడు? అంటే అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించలేదు. ఆయన లైనప్ చూస్తుంటే? ఎంత బిజీగా ఉన్నాడో అర్ధమ వుతుంది. ప్రస్తుతం `కూలీ` సినిమా చేస్తున్నాడు.
ఇది పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రిలీజ్ అనంతరం `ఖైదీ 2` పట్టాలెక్కుతుంది. అనంతరం సూర్యతో `రోలెక్స్` టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండింటి తర్వాత `లియో 2` చేసే అవకాశం ఉంది. ఇవన్నీ పూర్తవ్వాలంటే మరో మూడు నుంచి నాలుగేళ్ల అయినా సమయం పడుతుందని అంచనా. ఆ తర్వాతే లోకేష్ తెలుగు సినిమా గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఆ మధ్య మరో ఆరేళ్ల పాటు తన నుంచి హింసతో కూడిన సినిమాలే వస్తాయన్నాడు.
గన్స్..బాంబు లు లేకుండా సినిమాలే ఉండవన్నాడు. వాటిని ప్రేక్షకులు కొన్నాళ్ల పాటు భరించాలనేసా డు. అలాగే డైరెక్టర్ గా సినిమాలు చేయాలని లేదని మరో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. పది సినిమాలు చేసి ఇండస్ట్రీ వదిలిపోతానని అన్నాడు. దీంతో అంతటి ప్రతిభావంతుడు ఇండస్ట్రీని వదిలేస్తా ఎలా అంటూ కమల్, రజనీకాంత్ లాంటి వారు సర్ది చెప్పే ప్రయత్నం చేసారు. మరి ఇలాంటి తర్జన భర్జన మధ్య లోకేష్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందా? ఉండదా? అన్నది చూడాలి.
