Begin typing your search above and press return to search.

లియో.. అసలు ప్లాన్ అది కాదు!: లోకేష్ కనగరాజ్

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో లియో మూవీ రూపొందిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 July 2025 12:13 PM IST
లియో.. అసలు ప్లాన్ అది కాదు!: లోకేష్ కనగరాజ్
X

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో లియో మూవీ రూపొందిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా.. అనుకున్న రేంజ్ లో మ్యాజిక్ చేయలేకపోయింది. మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకున్న లియో.. హైప్ తగ్గట్టు ఆడియన్స్ ను అలరించలేకపోయింది.

ఆ విషయాన్ని లోకేష్ కూడా పలు సందర్భాల్లో ఒప్పుకున్నారు. ముఖ్యంగా విక్రమ్ భారీ విజయం తర్వాత ఆయన లియో సినిమా తీశారు. తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందించడంతో అంతా ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో పేలవమైన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తో నిరాశ వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఆ విషయంపై లోకేష్ మాట్లాడారు. తన అప్ కమింగ్ మూవీ కూలీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో లియో మూవీ కోసం ప్రస్తావించారు. ఆ సినిమా టైమ్ లో ఫ్లాష్‌ బ్యాక్‌ పెట్టాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉండిపోయానని తెలిపారు. సినిమాలో విజయ్ పార్తీబన్ పాత్ర డ్యాన్స్ చేయలేడని గుర్తుచేశారు.

ఫస్టాఫ్ అంతా అలాగే చూపించామని తెలిపారు. కానీ విజయ్ సర్ ఇతర చిత్రాల మాదిరిగా కాకుండా లియోలో ఎంట్రీ డ్యాన్స్ లేదని, ఆయన మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని, కచ్చితంగా ఒక మాస్‌ సాంగ్‌ ఉండాలని అన్నారు. అందుకే ప్రేక్షకులు నిరాశ చెందుతారని తాను భావించి కాఫీ షాప్ సన్నివేశాన్ని రూపొందించానని చెప్పారు.

అక్కడ విజయ్ సర్ తన కిడ్ తో డ్యాన్స్ చేస్తారని తెలిపారు. అయితే సెకండాఫ్ లో ఒక సాంగ్ వల్ల ఫ్లాష్‌ బ్యాక్‌ ను తగ్గించానని, తన అసలు ప్లాన్ అది కాదని తెలిపారు. ఫ్లాష్‌ బ్యాక్ కోసం 30 నిమిషాల రన్‌టైమ్ ఉంటే బాగుండేదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కానీ సినిమాకు భారీ రన్‌ టైమ్‌ ను ఎవరూ అంగీకరించరని, ఆడియన్స్ ఒప్పుకోరని లోకేష్ అభిప్రాయపడ్డారు.

అందుకే తక్కువ రన్‌ టైమ్‌ లో సినిమా చేయడానికి ఫ్లాష్‌ బ్యాక్‌ ను 18 నిమిషాల్లో ముగించడం తప్ప తనకు వేరే మార్గం లేదని అన్నారు. మరో 30 నిమిషాలు పొడిగించి ఉంటే, సినిమా మరింత బాగుండేదని అన్నారు. అందుకే ఫ్లాష్‌ బ్యాక్‌ కు మిశ్రమ సమీక్షలు వచ్చాయని, దానికి తనదే తప్పని చెప్పారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.