Begin typing your search above and press return to search.

ప్ర‌చారం లేకుండా రిలీజ్ టాలీవుడ్ కి సాధ్యం కాదా?

ఏ సినిమాకైనా ప్ర‌చారం త‌ప్ప‌నిస‌రి. ఆప్రాజెక్ట్ లో ఎంత పెద్ద హీరో న‌టించిన ప‌బ్లిసిటీ లేకుండా రిలీజ్ చేయ‌రు. ఎంత వీలైంత అంత‌గా ప్ర‌చారం క‌ల్పించి అంతా ప‌క్కాగా అనుకున్న త‌ర్వాతే రిలీజ్ చేస్తారు.

By:  Tupaki Desk   |   18 July 2025 2:00 AM IST
ప్ర‌చారం లేకుండా రిలీజ్ టాలీవుడ్ కి సాధ్యం కాదా?
X

ఏ సినిమాకైనా ప్ర‌చారం త‌ప్ప‌నిస‌రి. ఆప్రాజెక్ట్ లో ఎంత పెద్ద హీరో న‌టించిన ప‌బ్లిసిటీ లేకుండా రిలీజ్ చేయ‌రు. ఎంత వీలైంత అంత‌గా ప్ర‌చారం క‌ల్పించి అంతా ప‌క్కాగా అనుకున్న త‌ర్వాతే రిలీజ్ చేస్తారు. సినిమా ప్ర‌చారం కోసమే కోట్లరూపాయ‌లు ఖ‌ర్చు చేస్తుంటారు. సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ ప్రచారం పీక్స్ కు చేరింది. ప్ర‌చారం కొత్త పుంత‌లు తొక్క‌డం ప్రారంభ‌మైంది. సినిమా ప్రారంభమైన ద‌గ్గ‌ర నుంచి రిలీజ్ వ‌ర‌కూ ప్ర‌త్యేకంగా ప్ర‌చార టీమ్ లు ప‌ని చేస్తుంటాయి.

ప్రారంభ స‌మ‌యంలో మీడియాకి ఎలాంటి పుటేజీ ఇవ్వాలి? సెట్స్ కు వెళ్లిన త‌ర్వాత ఎలాంటి అప్ డేట్ ఇవ్వాలి? ముగింపు ప్ర‌చారం ఎలా చేయాలి? రిలీజ్ కు రెడీ అవుతుందంటే ఆ ప‌ది-ప‌దిహేను రోజులు ప్ర‌చారం ఎలా ఉండాలి? అన్న దానిపై ప్ర‌త్యేక స్ట్రాట‌జీనే అనుస‌రిస్తుంటారు. గ్లింప్స్ , లిరిక‌ల్స్, టీజ‌ర్, ట్రైల‌ర్ అంటూ ఇలా ఒక్కొక్క‌టిగా రిలీజ్ అవుతుంటుంది ప్రీ రిలీజ్ వ‌ర‌కూ. అటుపై న‌టీనుటుల ఇంటర్వ్యూలు నిర్వ‌హిస్తుంటారు. కానీ లోకేష్ క‌న‌గ‌రాజ్ మాత్రం 'కూలీ' విష‌యంలో ఎలాంటి ప్ర‌చారం లేకుండానే రిలీజ్ చేయాల‌ని డిసైడ్ అయ్యాడు.

వాస్త‌వానికి ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేయ‌కుండా నేరుగా సినిమానే రిలీజ్ చేయాల‌నుకున్నాడు. కానీ అభిమానులు ఒత్తిడి చేసే స‌రికి ట్రైల‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇక సినిమాకు సంబంధించి ఆ ఒక్కటి త‌ప్ప ఇంకెలాంటి ప్రీరిలీజ్ స‌హా ఎలాంటి ప్ర‌చారం ఉండ‌దు. మ‌రి ప్ర‌చారం లేకుండానే రిలీజ్ విషయంలో లోకేష్ స్ట్రాట‌జీ ఎంటి? అన్న‌ది అంతు ప‌ట్ట‌ని అంశం.

'కూలీ' జ‌నాల్లోకి వెళ్లిపోయింది అన్న బ‌ల‌మైన న‌మ్మ‌క‌మా? సూప‌ర్ స్టార్ లాంటి స్టార్ హీరో సినిమాకు ప్ర‌చారం దేనికి అన్న ధీమానా? లేక లోకేష్ బ్రాండ్ తో రాణిస్తుంది అన్న కాన్పిడెన్సా? కార‌ణం ఏదైనా ప్ర‌చారం ఖ‌ర్చు మాత్రం లేదు. లియో సినిమా ని లోకేష్ పెద్ద‌గా ప్ర‌మోట్ చేయ‌కుండానే థియేట‌ర్లోకి తీసుకొచ్చాడు. మ‌రి ఇలాంటి స్ట్రాట‌జీని టాలీవుడ్ డైరెక్ట‌ర్లు అనుస‌రించలేరా? ప్ర‌చారం లేకుండా...ప్రీ రిలీజ్ లేకుండా థియేట‌ర్ల‌లోకి సినిమాని తీసుకుని రాగ‌ల‌రా? అన్న‌ది చూడాలి.