Begin typing your search above and press return to search.

లోకేష్‌ నోట శృతి మాటలు వైరల్‌..!

తాజాగా దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా సినిమాలో కీలక పాత్రలో నటించిన శృతి హాసన్ గురించి కూడా కామెంట్స్ చేశాడు.

By:  Tupaki Desk   |   28 July 2025 6:29 PM IST
లోకేష్‌ నోట శృతి మాటలు వైరల్‌..!
X

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన 'కూలీ' సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై కేవలం తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు, హిందీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఈయన గత చిత్రాలు విక్రమ్‌, లియో సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే లోకేష్‌ కనగరాజ్ సినిమా అనగానే అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్‌ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగల సమర్ధుడు అని ఇప్పటికే నిరూపితం అయ్యింది. కనుక కూలీ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


'కూలీ' సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ హడావిడి మొదలైంది. ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోషన్‌ కి సంబంధించిన స్టఫ్‌ను విడుదల చేస్తూ వచ్చారు. తాజాగా దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా సినిమాలో కీలక పాత్రలో నటించిన శృతి హాసన్ గురించి కూడా కామెంట్స్ చేశాడు. వీరిద్దరూ కూలీ సినిమాకు ముందు ఒక మ్యూజిక్‌ ఆల్బం కోసం వర్క్ చేసిన విషయం తెల్సిందే. ఆ అనుబంధంతోనే కూలీ సినిమాలో నటించేందుకు గాను శృతి హాసన్‌ ఓకే చెప్పిందని తెలుస్తోంది. విక్రమ్‌ సమయంలోనూ వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవని కొందరు అంటున్నారు.

తాజా ఇంటర్వ్యూలో లోకేష్‌ కనగరాజ్‌ మాట్లాడుతూ కూలీలో శృతి హాసన్‌ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చాడు. ఒక మంచి పాత్రలో శృతిని చూడబోతున్నారు అన్నాడు. అంతే కాకుండా శృతి హాసన్‌ను వ్యక్తిగతంగా ప్రశంసించాడు. సెట్‌లో శృతి హాసన్‌ ఉంటే చాలా ఎనర్జీ ఉన్నట్లుగా ఉండేది. సెట్‌ నిండా మగవారు ఉన్నా కూడా శృతి హాసన్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా తనకు చెప్పిన సీన్‌ను చేస్తూ ఉండేది. అందరితోనూ చాలా సన్నిహితంగా ఉండేది. సెట్‌లో చాలా ఉత్సాహంగా ఉండటంతో పాటు, ఆమెకు చెప్పిన సీన్‌ను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండేది. షూటింగ్‌ చేసుకుని బయట పడాలి అనుకునే రకం శృతి హాసన్‌ కాదని లోకేష్‌ చెప్పుకొచ్చాడు.

ప్రమోషన్స్‌ సమయంలో శృతి హాసన్‌ నుంచి చాలా సహాయం అందుతుందని కూడా లోకేష్‌ చెప్పుకొచ్చాడు. ప్రమోషన్‌ వీడియోలు చేయడం, పాటలు రాయడం, పాడటం వంటివి చేస్తుంది. చాలా మంది హీరోయిన్స్‌ ప్రమోషన్స్‌ను పట్టించుకోరు. కానీ శృతి హాసన్‌ మాత్రం సినిమా విడుదల అయ్యేంత వరకు యూనిట్‌ సభ్యులకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని, ఆమె గొప్ప వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్‌ అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లడం కోసం ఆమెకు చేతనైన సాయం చేసేందుకు ఎప్పుడూ ముందు ఉంటుంది. కూలీ సినిమాలో ఆమె పాత్ర తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. వరుస బ్రేకప్స్ కారణంగా శృతి హాసన్ కాస్త నిరుత్సాహంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత శృతి పుంజుకుంటుందేమో చూడాలి.