Begin typing your search above and press return to search.

లోకేష్ క‌న‌గ‌రాజ్ హీరో అవ్వాల‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడా?

తాజాగా కోలీవుడ్ ద‌ర్శ‌క సంచ‌ల‌నం లోకేష్ క‌న‌గ‌రాజ్ కూడా న‌టుడిగా ఎంట్రీ ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   8 May 2025 5:35 AM
Lokesh Kanagaraj Acting Debut
X

ఇండ‌స్ట్రీకి ఎన్నెన్నో క‌ల‌ల‌తో వ‌స్తుంటారు. హీరో అవ్వాల‌ని...న‌టుడు అవ్వాల‌ని...నిర్మాత అవ్వాల‌ని.. ర‌చ‌యిత అవ్వాల‌ని ఇలా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఇండ‌స్ట్రీ లో ఒక‌టి అనుకుంటే మ‌రొటి జ‌రుగుతుంటుంది. రైట‌ర్లు..డైరెక్ట‌ర్లు అవ్వాల‌నుకున్న వాళ్లు న‌టుల‌వుతారు. న‌టులు అవ్వాల‌నుకున్న వాళ్లు డైరెక్ట‌ర్లు అవుతుంటారు. ఇదంతా అనుకోకుండా జ‌రిగిపోతుంది. తాము అనుకున్న‌ది సాధించాలి అంటే ముందు వ‌చ్చిన అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకున్న త‌ర్వాత గ‌మ్యానికి చేరుకోవ‌చ్చు అన్న ప్ర‌ణాళిక‌ తోనే చాలా మంది ముందుకెళ్తారు.

టాప్ డైరెక్ట‌ర్ల‌గా వెలిగిన ఎస్ .జె. సూర్య‌, గౌత‌మ్ మీన‌న్ లు ఇప్పుడు న‌టులుగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ ద‌ర్శ‌క సంచ‌ల‌నం లోకేష్ క‌న‌గ‌రాజ్ కూడా న‌టుడిగా ఎంట్రీ ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే లోకేష్ శ్రుతి హాసన్ తో క‌లిసి ఓ యాడ్ షూట్ లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. అందులో ఇద్ద‌రు ఎంతో రొమాంటిక్ పెర్పార్మెన్స్ ఇచ్చారు. అది చూసి లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉంద‌ని చ‌ర్చ సాగింది.

అయితే తాజాగా 'కెప్టెన్ మిల్ల‌ర్' ఫేం అరుణ్ మాథేశ్వ‌రన్ లోకేష్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కించా ల‌నుకుంటున్నాడుట‌. అందుకు లోకేష్ కూడా ఎస్ చెప్పిన‌ట్లు స‌మాచారం. దీంతో లోకేష్ ఇండ‌స్ట్రీకి హీరో అవ్వ‌డానికి వ‌చ్చాడా? అన్న సందేహాలు మొద‌ల య్యాయి. ద‌ర్శ‌కుడిగా ప‌ది సినిమాలు తీసిన త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వానికి గుడ్ బై చెప్పేస్తాన‌ని లోకేష్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

సినిమాలు డైరెక్ట్ చేయల‌ని లేద‌ని మ‌న‌సులో మాట‌ని ఎంతో ఓపెన్ గా చెప్పాడు ఆ మ‌ధ్య‌. అయితే తాజాగా లోకేష్ కి న‌టుడు అవ్వాల‌ని ఉందా? అన్న అస‌లు సంగ‌తి ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతుంది. మొన్న శ్రుతి హాస‌న్ తో యాడ్...నేడు హీరోగా సినిమా? ఇవ‌న్నీ లోకేష్ లో కొత్త కోణాన్ని బ‌య‌టకు తెస్తు న్నాయి. న‌టుడు అవ్వాల‌నే ఉద్దేశంతోనే సినిమాల‌ను డైరెక్ట్ చేయ‌న‌న్నాడా అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోందిప్పుడు.