Begin typing your search above and press return to search.

'నేనేం RRR చేయడం లేదు.. 3ఏళ్ల టైమ్ పట్టడానికి'

కూలీ మూవీ మల్టీస్టారర్ గా రానున్న విషయం తెలిసిందే. అందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ సహ పలువురు నటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 May 2025 11:04 AM IST
Lokesh Kanagaraj Opens Up About Coolie
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చవిచూడని డైరెక్టర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఆ తర్వాత పలు సీక్వెల్స్ తో పాటు క్రేజీ ప్రాజెక్టులతో సందడి చేయనున్నారు లోకేష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయగా, ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కూలీ మూవీ మల్టీస్టారర్ గా రానున్న విషయం తెలిసిందే. అందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ సహ పలువురు నటిస్తున్నారు.

ఇప్పుడు ఆ విషయం కోసం మాట్లాడారు లోకేష్. కూలీ సినిమా తీస్తున్న సమయంలో సౌబిన్ షాహిర్ ఆరేడు చిత్రాలు వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. 7-8 నెలల గ్యాప్ లో భారీ ప్రాజెక్టులను పక్కన పెట్టారని తెలిపారు. సినిమాలో చాలా గెటప్స్ ఉన్నాయని, కాబట్టి ఇతర మూవీలకు దూరంగా ఉండమని తాను చెప్పానని అన్నారు.

అందుకే ఆయన అలా చేశారని తెలిపారు లోకేష్ కనగరాజ్. తన మూవీలోని క్యాస్టింగ్ అంతా ప్రాజెక్ట్‌ కే పూర్తిగా అంకితభావంతో ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు. తన సినిమాలను 6- 8 నెలల్లో పూర్తి చేస్తానని వెల్లడించిన లోకేష్.. తానేం ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తీయడం లేదు కదా అని వ్యాఖ్యానించారు.

మూడు సంవత్సరాలపాటు ఆర్టిస్టులను హోల్డ్ చేసే స్థాయి సినిమా కాదని, అలాంటి చిత్రాలు చేయనని తెలిపారు. గతంలో ఏ మూవీకైనా ముందు నిర్మాతలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాక షూటింగ్ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు కూలీ మూవీ విషయంలో అలా జరగలేదని అన్నారు. ప్రశాంతంగా వర్క్ చేస్తున్నామని తెలిపారు.

అదే సమయంలో రజనీతో వర్క్ చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ముఖ్యంగా జీవిత సత్యాలు తెలిశాయని చెప్పిన లోకేష్.. ఆయన తన లైఫ్ స్టోరీస్ తో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించారు. తలైవా చెప్పిన విషయాలు విన్న తర్వాత, ఆయన ముందు మనం ఆఫ్ట్రాల్ అనిపించినట్లు పేర్కొన్నారు. అలా రజినీపై తన గౌరవాన్ని పంచుకున్నారు.