Begin typing your search above and press return to search.

లిటిల్ ప్రిన్సెస్ క్లిన్ కారాతో మెగా సంక్రాంతి

మెగా ఫ్యామిలీ బెంగ‌ళూరు ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుక‌లు జ‌రుపుకోవ‌డం ఈసారి మ‌రింత ప్ర‌త్యేక‌త‌ను తెచ్చింది.

By:  Tupaki Desk   |   15 Jan 2024 4:48 AM GMT
లిటిల్ ప్రిన్సెస్ క్లిన్ కారాతో మెగా సంక్రాంతి
X

మెగా ఫ్యామిలీ బెంగ‌ళూరు ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుక‌లు జ‌రుపుకోవ‌డం ఈసారి మ‌రింత ప్ర‌త్యేక‌త‌ను తెచ్చింది. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాస‌న కొణిదెల సంక్రాంతి వేడుకల‌ను చాలా అందంగా యూనిక్ గా మార్చారు. ఈ వేడుక‌ల్లో అంద‌రి క‌ళ్లు చెర్రోపాస‌న దంప‌తుల‌కు జ‌న్మించిన‌ లిటిల్ ప్రిన్సెస్ క్లిన్ కారాపైనే.


ఇప్ప‌టికే ఈ వేడుక‌ల‌కు సంబంధించిన చాలా విశేషాల‌ను ఫోటోల రూపంలో ఉపాస‌న తన సోష‌ల్ మీడియాలో రివీల్ చేసారు. మొత్తం కుటుంబంతో ఈ పండుగ‌ను జరుపుకోవడానికి బెంగళూరుకు వెళ్లగా వీరితో పాటు, నూతన వధూవరులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి కూడా ఈవెంట్ కి విచ్చేసారు. కొత్త కోడ‌లు లావ‌ణ్య సున్నుండ‌లు త‌యారు చేసి అంద‌రికీ పంచిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

రామ్ చరణ్ ఒక నిపుణుడైన వంటగాడిలా మారిపోయి.. దోసెలు గ‌రిట‌తో తిప్పడం వేడుకలో హైలైట్. సంక్రాంతి వేడుకను కుటుంబ ఈవెంట్ గా సెల‌బ్రేట్ చేయ‌డంతో అక్క‌డ మెగా కుటుంబ హీరోలు కొలువు దీరి క‌నిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇంత‌కుముందు రివీల‌య్యాయి. ఇక ఈ వేడుక‌ల‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా హాజ‌ర‌య్యార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ ఆయ‌న ఫోటోలు ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ఈ వేడుక‌ల పూర్తి సారాంశానికి సంబంధించిన మ‌రిన్ని ఫోటోలు వీడియోల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.