Begin typing your search above and press return to search.

లిటిల్ హార్ట్స్: వార్ 2 - వీరమల్లు.. అన్నిటినీ కొట్టేసిందిగా..

టాలీవుడ్‌లో రిలీజ్ అయిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ ఒక రేంజ్‌లో ఫైటింగ్ చేస్తూనే ఉంటుంది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా, ప్రేక్షకుల రెస్పాన్స్ ఏంటి అన్నదే ఫైనల్ రిజల్ట్‌ను నిర్ణయిస్తుంది.

By:  M Prashanth   |   7 Sept 2025 4:12 PM IST
లిటిల్ హార్ట్స్: వార్ 2 - వీరమల్లు.. అన్నిటినీ కొట్టేసిందిగా..
X

టాలీవుడ్‌లో రిలీజ్ అయిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ ఒక రేంజ్‌లో ఫైటింగ్ చేస్తూనే ఉంటుంది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా, ప్రేక్షకుల రెస్పాన్స్ ఏంటి అన్నదే ఫైనల్ రిజల్ట్‌ను నిర్ణయిస్తుంది. ఈ మధ్య కాలంలోనే పలు స్టార్ సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై, ఆశించిన స్థాయిలో క్లిక్ కాలేదు. అదే సమయంలో కొన్ని చిన్న సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్‌లో అలరిస్తున్నాయి.

ఇటీవల విడుదలైన వార్ 2, హరిహర వీరమల్లు, అనుష్క నటించిన ఘాటీ సినిమాలు ఫ్లాప్ టాక్ అందుకున్నాయి. భారీ అంచనాలతో వచ్చినా ఆ సినిమాలు కలెక్షన్ల విషయంలో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయాయి. ఇక లిటిల్ హార్ట్స్ అనే చిన్న మూవీ ఓపెనింగ్స్ దగ్గరే సెన్సేషన్ సృష్టించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అమెరికా బాక్సాఫీస్ లెక్కలు చూస్తే, లిటిల్ హార్ట్స్ సినిమా మొదటి రోజుకి 115K డాలర్లు రాబట్టింది. ఇది స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ($114K), హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో వచ్చిన వార్ 2 ($104K) కలెక్షన్లను కూడా దాటింది. ఇక అనుష్క శెట్టి నటించిన ఘాటీ మాత్రం మొదటి రోజుకి 27K డాలర్ల వద్దే ఆగిపోయింది.

యూఎస్ లో ఇటీవల వచ్చిన తెలుగు సినిమాల టాప్ గ్రాస్

లిటిల్ హార్ట్స్ - $115K

హరిహర వీరమల్లు - $114K

వార్ 2 - $104

ఘాటీ - $27K

అంటే చిన్న సినిమాగా వచ్చిన లిటిల్ హార్ట్స్, ఈ భారీ సినిమాలన్నిటినీ ఓపెనింగ్స్ లో ఔట్‌పర్ఫామ్ చేసింది. ఈ ట్రెండ్ తో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో కంటెంట్ బేస్డ్ సినిమాలు ఏ స్థాయిలో పనిచేస్తాయో లిటిల్ హార్ట్స్ మరోసారి నిరూపించింది. పెద్ద సినిమాలు అయినప్పటికీ నెగిటివ్ టాక్ వలన కుదరకపోవడం, చిన్న సినిమా అయినా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వలన రాణించడం అన్నది బాక్సాఫీస్ యొక్క నిజమైన సత్యం.

అమెరికాలో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా లిటిల్ హార్ట్స్ కి పాజిటివ్ బజ్ కొనసాగుతోంది. ఇక లిటిల్ హార్ట్స్ రెండో రోజు కలెక్షన్లలో కూడా అద్భుతమైన ట్రెండ్ చూపించింది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న సినిమా క్లీన్ హిట్‌గా నిలవడం ఖాయం అయ్యింది. ముఖ్యంగా లిమిటెడ్ స్క్రీన్స్ తో ప్రారంభమైనప్పటికీ, పాజిటివ్ టాక్ కారణంగా తర్వాతి రోజుల్లో స్క్రీన్స్ పెరగడం సినిమాకి మరో బూస్ట్ ఇచ్చింది.