Begin typing your search above and press return to search.

కోట బొమ్మాళిలో జానపద గీతం..లింగి లింగి లింగిడి..!

శ్రీకాకుళం యాసలో సాగే మాస్ సాంగ్ ఇది. ఇటీవల ప్రోమో విడుదల చేయగా, తాజాగా, ఈ ఫుల్ సాంగ్ ని విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   11 Sep 2023 2:42 PM GMT
కోట బొమ్మాళిలో జానపద గీతం..లింగి లింగి లింగిడి..!
X

పాపులర్ గీతా ఆర్ట్స్ కి చెందిన మరో బ్యానర్ GA 2 పిక్చర్స్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ బ్యానర్ లో ఇప్పటి వరకు చాలా మంచి సినిమాలు వచ్చాయి. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి అంతేకాదు, ఇతర భాషల్లో విడుదలైన సినిమాలను డబ్బింగ్ చేసి కూడా విడుదల చేశారు. కాగా, ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ మరో క్రేజీమూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

మళయాళంలో విడుదలై సూపర్ హిట్ అయిన నాయట్టు మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి కోట బొమ్మాళీ అనే టైటిల్ ని కొంతకాలం క్రితమే ప్రకటించారు. కాగా, తాజాగా ఈమూవీ నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఆ పాట ఓ జానపద గేయం కావడం విశేషం.

శ్రీకాకుళం యాసలో సాగే మాస్ సాంగ్ ఇది. ఇటీవల ప్రోమో విడుదల చేయగా, తాజాగా, ఈ ఫుల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాటకు రేలారే ఫేమ్ పి. రఘు సాహిత్యం అందించారు. ఆయనే స్వయంగా ఈ పాటను ఆలపించారు. ముకుందన్ ఈ పాటకు కంపోజ్ చేశారు.

విజయ్ పోలకి కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో శివానీ రాజశేఖర్ , రాహుల్ విజయ్ స్టెప్పులు వేశారు. ఇక, ఈ పాటలో శివానీ డీ గ్లామర్ లుక్ లో కనపడుతోంది. సింపుల్ కాటన్ చూడీదార్ ధరించి ఉంది. శ్రీకాంత్ కూడా సింపుల్ స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు.

ఈ మూవీలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక, శ్రీకాంత్, రాహుల్, శివానీలు పోలీసు పాత్రలు పోషిస్తున్నారు. ఈ ముగ్గురు అధికారులు పై అధికారుల అవినితీ చట్రంలో ఇరుక్కుపోయినప్పుడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

జోహార్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.