Begin typing your search above and press return to search.

ప్రియుడుకి లైగ‌ర్ బ్యూటీ మ‌రో స‌ర్ ప్రైజ్!

మ‌రి ఇది అత‌ని వెర్ష‌న్ లో ..స్నేహ‌మా? ఆక‌ర్ష‌ణ‌? ప్రేమ అన్న‌ది అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   16 Nov 2023 5:21 PM GMT
ప్రియుడుకి లైగ‌ర్ బ్యూటీ మ‌రో స‌ర్ ప్రైజ్!
X

అదిత్యారాయ్ క‌పూర్-అన‌న్యా పాండే రిలేష‌న్ షిప్ లో ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వెడెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి చాటు మాటు వ్య‌వ‌హారాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు బ‌ట్ట‌బ‌య‌లు చేస్తూ షాకిస్తుంది. ఇటీవ‌లే మాల్దివ్ వెకేషన్ ఫోటోలు సైతం నెట్టింట దుమారం రేపాయి. కానీ అన‌న్య మాత్రం త‌మ మ‌ధ్య కేవ‌లం స్నేహం త‌ప్ప ఇంకెలాంటి రిలేష‌న్ షిప్ లేదంటోంది. అదిత్య క‌పూర్ మాత్రం ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.

మ‌రి ఇది అత‌ని వెర్ష‌న్ లో ..స్నేహ‌మా? ఆక‌ర్ష‌ణ‌? ప్రేమ అన్న‌ది అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా ఆదిత్య‌రాయ్ క‌పూర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అమ్మ‌డు ప్ర‌త్యేకంగా విషెస్ తెలిపి స‌ర్ ప్రైజ్ చేసింది. ఓ ఫోటోని పోస్ట్ చేసి దానికి హ్యాపీ బ‌ర్త్ డే ఏడి అంటూ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. అభిమానులు ఆ జోడీకి విషెస్ తెలియ‌జేస్తున్నారు.

అన‌న్య పాండే టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. `లైగ‌ర్` తో అమ్మ‌డికి గ్రాండ్ లాంచింగ్ జ‌రిగినా క‌లిసిరాలేదు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా డిజాస్ట‌ర్ అయింది. దీంతో ఆ సినిమాపై అన్య‌న్యా పాండే రీసెంట్ గా నిప్పులు చెరిగింది. లైగ‌ర్ లో న‌టించి జీవితంలో చేయ‌కూడ‌ద‌ని పెద్ద త‌ప్పు చేసిన‌ట్లు ఫీలైంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో త‌ప్ప ఇంకే భాష‌లో అవ‌కాశాలు రాలేదు.

ఇక ఆదిత్య‌రాయ్ క‌పూర్ కెరీర్ కూడా ఏమంత వేగంగా ప‌రుగులు పెట్ట‌లేదు. చాలా కాలంగా స‌రైన స‌క్సెస్ లేదు. గ్యాప్ ఇవ్వ‌కుండా ఏడాదికో సినిమా చేస్తున్నాడు గానీ ఫ‌లితాలు నిరాశ ప‌రుస్తున్నాయి. ప్ర‌స్తుతం `మెట్రో ఇన్` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఆన్ సెట్స్ లో ఉంది.