Begin typing your search above and press return to search.

ఖుషి రెస్పాన్స్.. ఏజెంట్, మాచర్ల కంటే తక్కువే..

ఈ మూవీ పక్కా హిట్ అవుతుందని మూవీ టీమ్, ముఖ్యంగా విజయ్ దేవరకొండ నమ్మకంగా ఉన్నాడు. అంత నమ్మకంగా ఉన్నా ట్రైలర్ కి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడం గమనార్హం.

By:  Tupaki Desk   |   10 Aug 2023 12:59 PM GMT
ఖుషి రెస్పాన్స్.. ఏజెంట్, మాచర్ల కంటే తక్కువే..
X

సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఖుషీ. ఈ మూవీ పై చాలా ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కాగా, తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం ఏర్పాటు చేసి ట్రైలర్ విడుదల చేశారు. విజయ్, సమంత ఫ్యాన్స్ కి ఈ ట్రైలర్ బాగా నచ్చేసింది. ఈ ఇద్దరికీ హిట్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ విడుదల కాకముందు నుంచే ఈ మూవీ పై చాలా ఎక్కువ బజ్ ఉంది. వీరిద్దరూ కలిసి సినిమా చేయడం దగ్గర నుంచి, అది లవ్ స్టోరీ కావడం, పాటలు కూడా సూపర్ గా ఉండటంతో అందరి కళ్లు ఈ మూవీపైనే పడ్డాయి.

నిజానికి అంత బజ్ ఉన్న ఏ మూవీది అయినా ట్రైలర్, టీజర్ విడుదలైతే రికార్డులు బద్దలు అవ్వాలి. కానీ, ఈ ట్రైలర్ కి పెద్దగా వ్యూస్ రాకపోవడం గమనార్హం. విడుదల చేసిన 24 గంటల్లో ఈ ట్రైలర్ కి 9.82 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఈ మూవీ పక్కా హిట్ అవుతుందని మూవీ టీమ్, ముఖ్యంగా విజయ్ దేవరకొండ నమ్మకంగా ఉన్నాడు. అంత నమ్మకంగా ఉన్నా ట్రైలర్ కి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడం గమనార్హం.

ఇటీవల విడుదలై అట్టర్ ప్లాప్ అయిన నితిన్ మాచర్ల నియోజకవర్గం, అఖిల్ ఏజెంట్ సినిమా ట్రైలర్లకు అంతకు మించి వ్యూస్ రావడం గమనార్హం. ఇప్పటి వరకు టైర్ 2 మీడియమ్ రేంజ్ సినిమాల ట్రైలర్లు రిలీజ్ చేసిన 24 గంటల్లో వ్యూస్ చూసుకుంటే, అన్నింట్లోనూ ఖుషీ తక్కువ వ్యూస్ వచ్చాయి. విజయ్ దేవర కొండ లైగర్ మూవీకి 24 గంటల్లో 16.80 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక, నితిన్ మాచర్ల నియోజక వర్గానికి 13.11 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టినవే.

కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ మూవీ బింబిసార ట్రైలర్ కి 12.30 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అఖిల్ రీసెంట్ ప్లాప్ మూవీ ఏజెంట్ కి 10.54 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రామ్ వారియర్ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీనికి 10.53 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ లెక్కన ఖుషీకి అంత బజ్ ఉండి కూడా ఇంత తక్కువ వ్యూస్ రావడం ఏంటో ఆలోచించాల్సిందే.

ఇక, మూవీ ట్రైలర్ విషయానికి వస్తే ఇదొక ప్రేమ కథ అనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది. అయితే, పాటలు చూసినప్పుడు చాలా మందికి సందేహాలు కలిగాయి. సమంత ముస్లిం లేక, హిందూ నా అని, ఈ విషయంలో ట్రైలర్ లో క్లారిటీ వచ్చింది. పక్కా బ్రాహ్మిణ్ అమ్మాయిని, క్రిస్టియన్ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఏమైంది అనేది కథ. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించకున్నా, పెళ్లి చేసుకున్న ఈ జంట ఎలాంటి సమస్యలు ఎదుర్కొందో చూడాలంటే మూవీ చూడాల్సిందే. ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా సినిమాల ఛాయలు గుర్తుకు వస్తున్నాయి. ఇక, ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.