Begin typing your search above and press return to search.

లియో ట్విస్ట్.. ఎక్కడో కొడుతోంది లోకేష్?

ట్రైలర్​లో దాచి ఉంచిన సంజయ్ దత్ పాత్ర గురించి చెప్పారు. చిత్రంలో విజయ్‌కు తండ్రిగా సంజయ్‌దత్‌ నటించారని తెలిసింది.

By:  Tupaki Desk   |   15 Oct 2023 3:00 AM GMT
లియో ట్విస్ట్.. ఎక్కడో కొడుతోంది లోకేష్?
X

దళపతి విజయ్ నటించిన 'లియో' సినిమా మరో ఐదు రోజుల్లో గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్​గా యూకేఏలో ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా ప్లాట్‌లైన్‌ స్టోరీ లీక్ అయింది.

సినిమాకు సంబంధించిన ఓ ఇన్​సైడ్ సోర్స్ ద్వారా అందిన సమాచారం ప్రకారం.. చిత్రంలో ప్రధాన ట్విస్ట్ రివీల్ చేశారు. ట్రైలర్​లో దాచి ఉంచిన సంజయ్ దత్ పాత్ర గురించి చెప్పారు. చిత్రంలో విజయ్‌కు తండ్రిగా సంజయ్‌దత్‌ నటించారని తెలిసింది. తండ్రీకొడుకుల మధ్య సాగే గొడవ ఈ సినిమా అసలు కథాంశమని అంటున్నారు.

ఈ లైన్ బయటకు తెలియడంతో విక్టరీ వెంకటేశ్​ ధర్మ చక్రం సహా అనేక ఇతర తెలుగు తమిళ సినిమాలను ఇది గుర్తు చేస్తుందని చెబుతున్నారు. లియో సినిమా ఆ సినిమాలను పోలి ఉండవచ్చని పేర్కొంటున్నారు. ఇకపోతే చిత్రంలో విజయ్​.. రెండు అవతారాలలో, డబుల్ యాక్షన్‌లో కనిపించవచ్చనే మరో రూమర్​ కూడా ఉంది.

మెగా పవర్ స్టార్​ రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. 'విక్రమ్‌'లో రోలెక్స్‌లా 'కోబ్రా' పేరుతో ఆయన పాత్రను పరిచయం చేస్తారని అంటున్నారు. అయితే, దీనిపై మూవీ టీమ్​ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి నిజంగా ఈ సినిమాలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారా? లేదా? తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతానికి, ఈ సినిమా గురించి ఇంకా ఏమీ బయటకు రాకుండా దర్శకుడు జాగ్రత్త పడుతున్నారు.

ఇక తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ లియో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.త్రిష హీరోయిన్​గా నటించింది. అర్జున్‌ సర్జా, సంజయ్‌ దత్‌, దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 19న సినిమా విడుదల కానుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటుందో..