Begin typing your search above and press return to search.

లియో అసలు కాన్సెప్ట్ అదే..

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ లియో. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది

By:  Tupaki Desk   |   25 Sep 2023 11:30 AM GMT
లియో అసలు కాన్సెప్ట్ అదే..
X

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ లియో. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ లో భాగంగా వస్తోంది. మూవీలో సంజయ్ దత్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ కూడా విలన్ గా మరో బలమైన పాత్ర చేస్తున్నారు.

ఇళయదళపతి కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ లియో చిత్రంపై జరిగింది. ఇప్పటికే థీయాత్రికల్, నాన్ థీయాత్రికల్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయిపోయాయి. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారానే ఈ చిత్రానికి ఏకంగా 205 కోట్ల వరకు తిరిగి వచ్చింది. థియేటర్స్ బిజినెస్ భారీ ఎత్తున జరిగింది. ఒక్క తెలుగులోనే 20 కోట్లకి దిల్ రాజు లియో మూవీ హక్కులు సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ కాన్సెప్ట్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ ప్రచారం నడుస్తోంది. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఉంది. అలాగే కూతురు సెంటిమెంట్ చాలా కీలకమైన ఎలిమెంట్ గా ఉండబోతుందంట. దాంతో పాటు మనీ చుట్టూ కథనం తిరుగుతుందని టాక్. ఓవరాల్ గా చెప్పాలంటే కథలో డబ్బు, కూతురు, గ్యాంగ్ స్టార్ ఎలిమెంట్స్ మెయిన్ పిల్లర్స్ గా ఉంటాయంట.

ఇవన్నీ కథని డ్రైవ్ చేస్తూ అదిరిపోయే ఎలివేషన్స్ తో ఉండబోతోన్నట్లు తెలుస్తోంది. అనిరుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి అదనపు బలం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కచ్చితంగా ఈ మూవీ కోలీవుడ్ లో జైలర్ రికార్డులని ఎలాగో రోబో 2.ఓ రికార్డుని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్న మాట. గత కొంతకాలంగా విజయ్ స్టోరీ సెలక్షన్ చూసుకుంటే చాలా పెర్ఫెక్ట్ గా ఉంటున్నాయి.

హిట్ బొమ్మ అయితేనే కథకి ఒకే చెబుతున్నాడు. లోకేష్ ట్రాక్ రికార్డు చూసుకున్న వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో లియో సినిమాపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.