Begin typing your search above and press return to search.

లియో సాంగ్స్ దెబ్బేసినా.. బజ్ తగ్గట్లేదు

ఇక ఇలాంటి టైంలో మంచి ఫామ్ లో ఉన్న అనిరుద్ రవిచంద్రన్ తన మ్యూజిక్ తో ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో అని అనుకున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 6:34 AM GMT
లియో సాంగ్స్ దెబ్బేసినా.. బజ్ తగ్గట్లేదు
X

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియో సినిమాపై తమిళ్ ఇండస్ట్రీలో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఆడియో పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ కూడా సినిమాపై బజ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ అయితే అందుకునే అవకాశం ఉంది.

అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ అలాగే ట్రైలర్ అంతంతమాత్రంగానే అనిపించాయి. ముఖ్యంగా ట్రైలర్ పై వచ్చిన ట్రోల్స్ అయితే ఇప్పటికి వైరల్ అవుతూనే ఉన్నాయి. అసలు విజయ్ లుక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు అని కామెంట్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి. ఇక ఇలాంటి టైంలో మంచి ఫామ్ లో ఉన్న అనిరుద్ రవిచంద్రన్ తన మ్యూజిక్ తో ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో అని అనుకున్నారు.

కానీ అతని నుంచి కూడా ఫాన్స్ కు పెద్దగా సర్ ప్రైజ్ ఏమే దక్కలేదు. రీసెంట్గా విడుదల చేసిన మరో సాంగ్ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఇంతకుముందు అనిరుద్ లోకేష్ కాంబినేషన్లో వచ్చిన మాస్టర్ విక్రమ్ రెండు సినిమాలు కూడా మ్యూజికల్ గా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ లో అందుకున్నాయి.

అంతే కాకుండా అందులో ఉండే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరో లెవెల్లో సక్సెస్ అయ్యింది. అయితే ఈసారి లియో విషయంలో మాత్రం అనిరుద్ ఇచ్చిన పాటలు ఏమి కూడా సినిమాపై అంచనాలను పెంచే విధంగా వైరల్ అయితే కాలేదు. కానీ ఈ కాంబినేషన్ ట్రాక్ రికార్డును బట్టి సినిమాలలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే గట్టిగానే ప్రతిసారి వర్కౌట్ అయింది.

కాబట్టి ఈసారి అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఇప్పిస్తాడు అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. దానికి తగ్గట్టుగా లోకేష్ కనకరాజు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా వర్కౌట్ అయితే సినిమాకు బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల వచ్చిన జైలర్ సినిమా సీన్స్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ తోనే ఎలివేషన్ దక్కింది. ఆ విషయాన్ని రజనీకాంత్ కూడా అందరి ముందు చెప్పాడు. ఇక ఇప్పుడు లియో సినిమా విషయంలో ఆ మ్యాజిక్ క్రియేట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.