Begin typing your search above and press return to search.

Lenin First Report - అఖిల్‌కు ‘లెనిన్’తో సరైన దారి దొరికిందా?

ఏ హీరో కూడా నేరుగా స్టార్ అయిపోడు. సినిమాలు క్లిక్ అయితే స్టార్ ఇమేజ్ ఆటోమేటిగ్గా వస్తుంది.

By:  Tupaki Entertainment Desk   |   10 July 2026 12:28 PM IST
Lenin First Report - అఖిల్‌కు ‘లెనిన్’తో సరైన దారి దొరికిందా?
X

ఏ హీరో కూడా నేరుగా స్టార్ అయిపోడు. సినిమాలు క్లిక్ అయితే స్టార్ ఇమేజ్ ఆటోమేటిగ్గా వస్తుంది. పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ వల్ల ఒక హీరోకు హైప్ వచ్చినా.. దాన్ని నిలబెట్టే సినిమా పడితేనే కెరీర్లో పైకి ఎదిగే అవకాశముంటుంది. అక్కినేని అఖిల్ కెరీరే ఇందుకు ఉదాహరణ. అరంగేట్రానికి ముందే విపరీతమైన హైప్ తెచ్చుకున్నప్పటికీ.. సరైన సినిమాలు చేయకపోవడం వల్ల కెరీర్ మొదలైన పదేళ్ల తర్వాత కూడా క్రాస్ రోడ్స్‌లోనే నిలబడ్డాడు అక్కినేని కుర్రాడు.

ఆలస్యంగా తత్వం బోధ పడిందో ఏమో.. ఈసారి మాస్ ఇమేజ్.. ఎలివేషన్లు అంటూ నేల విడిచి సాము చేయకుండా ‘లెనిన్’ రూపంలో కథ ప్రధానంగా సాగే సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు అఖిల్‌. హీరో కోసం కథ అని కాకుండా.. కథలో భాగంగా హీరో అనిపించే సినిమా చేశాడతను.

పల్లెటూరి నేపథ్యంలో ఇలాంటి సినిమాలు కొత్తేమీ కాదు. కానీ ఆసక్తికరమైన పాత్రలు.. థ్రిల్లర్ సినిమాల తరహా ట్విస్టులతో ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని పంచే ప్రయత్నం చేసింది ‘లెనిన్’. ఐతే డ్రామా అనుకున్నంతగా పండకపోవడం.. పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్ట్ మిస్సవ్వడం వల్ల ‘లెనిన్’ గొప్ప అనుభూతిని అయితే అందించలేకపోయింది. కానీ ‘లెనిన్’ ఎక్కడా బోరింగ్ అనే ఫీలింగ్ అయితే కలిగించదు.

కథ కోసం ట్విస్టులు అని కాకుండా ట్విస్టుల కోసం కథ అన్న ఫీలింగ్ కలిగించినప్పటికీ.. ‘లెనిన్’లో మలుపులు ప్రేక్షకులను కొంతమేర ఎంగేజ్ చేస్తాయి. అఖిల్ ఇంటెన్స్ పెర్ఫామెన్స్.. భాగ్యశ్రీ గ్లామర్.. అందమైన విజువల్స్.. చక్కగా చిత్రీకరించిన పాటలు.. భారీతనంతో కూడిన యాక్షన్ ఘట్టాలతో సగటు ‘లెనిన్’ కమర్షియల్ సినిమా నుంచి ఆశించే వినోదాన్ని అందిస్తుంది. అఖిల్ కెరీర్ ను గొప్ప మలుపు తిప్పే సినిమా కాదు కానీ.. అతడి గత చిత్రాలతో పోలిస్తే ‘లెనిన్’ ఎంతో బెటర్. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే వాచబుల్ అనిపించే ఫిలిం ఇది.

Full Review Coming Soon...