Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ కంటే పెద్ద పరీక్ష… ‘లెనిన్’తో ముగ్గురి ఫ్యూచర్ డిసైడ్

అక్కినేని యంగ్ హీరో అఖిల్‌కు ‘లెనిన్’ చిత్రంతో ఒక సాలిడ్ హిట్ కొట్టడం ఇప్పుడు అత్యంత అవసరంగా మారింది.

By:  Madhu Reddy   |   7 July 2026 2:52 PM IST
బాక్సాఫీస్ కంటే పెద్ద పరీక్ష… ‘లెనిన్’తో ముగ్గురి ఫ్యూచర్ డిసైడ్
X

సాధారణంగా ఒక సినిమా హిట్ అవ్వడం అనేది హీరోకో లేదా దర్శకుడికో ముఖ్యం అవుతుంది. కానీ ‘లెనిన్’ చిత్రం మాత్రం టాలీవుడ్‌లోని ముగ్గురు కీలక వ్యక్తుల భవిష్యత్తును, వారి క్రెడిబిలిటీని శాసించే ఒక అరుదైన మైలురాయిగా నిలిచింది. అక్కినేని అఖిల్, బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, మరియు క్రేజీ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ.. ఈ ముగ్గురికీ ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది. జులై 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ అసలు ఎందుకు ఇంత స్పెషల్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

అఖిల్ అక్కినేని 'కంబ్యాక్' సవాల్:

అక్కినేని యంగ్ హీరో అఖిల్‌కు ‘లెనిన్’ చిత్రంతో ఒక సాలిడ్ హిట్ కొట్టడం ఇప్పుడు అత్యంత అవసరంగా మారింది. తన కెరీర్ చుట్టూ సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలన్నా, పదే పదే రీ- ఎంట్రీలంటూ వచ్చే కామెంట్స్‌కు గట్టి సమాధానం ఇవ్వాలన్నా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వాల్సిందే. ఇక అన్నింటికీ మించి "అయ్యగారు ఈజ్ బ్యాక్" అంటూ కాలర్ ఎగరేసి గర్వంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

భాగ్యశ్రీ బోర్సే ‘ఐరన్ లెగ్’ ముద్ర చెరిగిపోవాలి:

ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే, ఆమె తన గత చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరిచినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఇక దీంతో కొందరు ఆమెను అన్‌లక్కీ చార్మ్ అని పిలవడం మొదలుపెట్టారు. అయినా కూడా ఆమెకు అవకాశాలు తగ్గకపోవడం విశేషం. ఇలాంటి టైంలో ‘లెనిన్’ రూపంలో ఆమెకు ఒక పెద్ద సక్సెస్ వస్తే, ఇండస్ట్రీలో ఆమె పొజిషన్ పూర్తిగా మారిపోవడం ఖాయం.

నిర్మాత నాగవంశీకి నిజమైన అగ్నిపరీక్ష:

ఈ సినిమా సక్సెస్ నిర్మాత నాగవంశీకి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు కూడా ఒక పెద్ద పరీక్షే. సంక్రాంతికి వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ కాస్త ఊరటనిచ్చినా.. ఆ తర్వాత కొన్ని ఒడిదొడుకులు ఎదురయ్యాయి. ఇక అఖిల్ కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చే బాధ్యతను నాగవంశీ తన భుజాలపై వేసుకున్నారు. అందుకే ఎక్కడా రాజీ పడకుండా, అవసరమైన చోట రీషూట్లు కూడా చేస్తూ చాలా జాగ్రత్తగా ఈ సినిమాను నిర్మించారు. సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది.

బాక్సాఫీస్ వద్ద జులై 10 డెడ్‌లైన్:

మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’ చిత్రం జులై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ డేట్ కేవలం ఒక నార్మల్ రిలీజ్ డేట్ మాత్రమే కాదు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పరువును, అఖిల్ కంబ్యాక్ స్టామినాను నిరూపించే ఒక రియల్ అగ్నిపరీక్ష. ఇక మరి ఈ ముగ్గురి కెరీర్‌కు ఎంతో ప్లస్ అయ్యేలా ‘లెనిన్’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే