Begin typing your search above and press return to search.

లేఖ లేఖ.. స్పార్క్ రొమాంటిక్ బీట్!

రీసెంట్‌గా మేకర్స్ ఈ సినిమాకు సంబందించిన 4వ సాంగ్ విడుదల చేశారు. లేఖ లేఖ.. అనే ఈ పాటను హెశమ్ అబ్దుల్ వహబ్ కంపోజ్ చేయగా అర్మాన్ మాలిక్ ఆలపించారు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 4:08 PM GMT
లేఖ లేఖ.. స్పార్క్ రొమాంటిక్ బీట్!
X

స్పార్క్ ది L.I.F.E అనే సినిమా ఇప్పుడు మంచి బజ్ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో ఒకటి. నవంబర్ 17వ తేదీన రాబోతున్న ఈ సినిమా టీజర్ ను కూడా ఇదివరకే విడుదల చేశారు. అలాగే రెగ్యులర్ గా పోస్టర్స్ విడుదల చేస్తూ సాంగ్స్ తో కూడా సినిమాకు హైప్ పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడ తగ్గకుండా సినిమాకు ప్రమోషన్స్ కూడా చేస్తూ జనాల దృష్టికి ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.


ఇక ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలు ఇదివరకే రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్లలో ఒక ట్రెండ్ సెట్ చేస్తున్న హెశమ్ అబ్దుల్ వహబ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కథానాయకుడిగా విక్రాంత్ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. మెహ్రీన్ పిర్జాదా, రుక్సార్ హీరోయిన్స్ గా నటించిన Spark the L.I.F.E లో ప్రతిభావంతులైన తారాగణం మరియు సిబ్బందితో మంచి బజ్ పొందింది.

రీసెంట్‌గా మేకర్స్ ఈ సినిమాకు సంబందించిన 4వ సాంగ్ విడుదల చేశారు. లేఖ లేఖ.. అనే ఈ పాటను హెశమ్ అబ్దుల్ వహబ్ కంపోజ్ చేయగా అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఇక అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటలో హీరో హీరోయిన్ పై చూపించే ప్రేమతో పాటు అతని క్యారెక్టర్ కూడా హైలెట్ అవుతోంది. లిరికల్ సాంగ్ లో విక్రాంత్ లుక్స్ అలాగే మెహ్రీన్ తో కెమిస్ట్రీ బాగా హైలెట్ అయ్యింది.

ఇక ఇదివరకే సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా స్పార్క్ సినిమా ఒక డిఫరెంట్ కంటెంట్ తో రాబోతున్నట్లు అని అర్ధమవుతుంది. టీజర్‌లో విక్రాంత్ పూర్తిగా స్టైలిష్‌గా కనిపించాడు. ఇక కాలేజీ విద్యార్థి నుండి ప్రత్యేక ఏజెంట్‌గా అతని ప్రయాణాన్ని అందులో చూడవచ్చు. యాక్షన్ తో పాటు మెహ్రీన్ పిర్జాదా మరియు రుక్సార్‌లతో చేసిన మ్యాజికల్ రొమాన్స్ అద్భుతంగా కనిపిస్తుంది. సినిమా స్టంట్ సీక్వెన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మేకర్స్ సినిమా మేకింగ్ విషయంలో రాజీ పడలేదని తెలుస్తోంది. ఇక హేషమ్ అందించిన అద్భుతమైన సౌండ్‌ట్రాక్ సినిమాకు మరొక అదనపు ఆస్తి అని చెబుతున్నారు. ఈ చిత్రానికి డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ దర్శకత్వం వహించగా మలయాళ నటుడు గురు సోమసుందరం మరియు నటీనటులు నాజర్, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, సత్య, శ్రీకాంత్, అయ్యంగార్, అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర వంటి నటీనటులు కూడా సినిమాలో ప్రత్యేకమైన పాత్రలలో నటించారు. ఇక తెలుగు, తమిళం, హింద్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.