Begin typing your search above and press return to search.

ఆస్కార్ మూవీ స్టార్‌ అనుమానాస్పద మృతి

ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకున్న 'పారాసైట్‌' చిత్రంలో కీలక పాత్రలో నటించిన కొరియన్‌ నటుడు లీ సన్‌ క్యూన్‌ మృతి చెందారు

By:  Tupaki Desk   |   27 Dec 2023 10:58 AM IST
ఆస్కార్ మూవీ స్టార్‌ అనుమానాస్పద మృతి
X

ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకున్న 'పారాసైట్‌' చిత్రంలో కీలక పాత్రలో నటించిన కొరియన్‌ నటుడు లీ సన్‌ క్యూన్‌ మృతి చెందారు. మొదట లీ సన్ క్యూన్‌ కనిపించడం లేదు అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆయన ఎక్కడికి వెళ్లాడా అంటూ పోలీసులు విచారణ చేపట్టారట.

ఒక వైపు పోలీసులు వెతుకుతూ ఉండగా లీ సన్ క్యూన్‌ మృతి చెందినట్లుగా ఆయన భార్య పేర్కొంది. ఇంట్లో సూసైడ్ నోట్‌ ను గుర్తించిన ఆమె బయటకు వచ్చి వెతకగా.. పార్కింగ్‌ చేసి ఉన్న కారులో ఆయన మృతదేహం కనిపించినట్లుగా ఆమె పోలీసులకు తెలియజేసినట్లు అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థలు తమ కథనం లో పేర్కొన్నాయి.

గతంలో చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు లీ సన్ క్యూన్ పై ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి కూడా ఆయన హవా తగ్గింది అనేది ప్రచారం. లీ సన్ మృతి విషయమై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

కారులో నిర్జీవ స్థితిలో ఉన్న లీ సన్ క్యూన్ మృతి పట్ల విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. లీ సన్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే చంపి కారులో ఎవరైనా పెట్టారా అనే కోణంలో ఎంక్వౌరీ జరుపుతున్నారని పోలీసులు ప్రకటించారు.