Begin typing your search above and press return to search.

LCU -ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదు

అదేమిటి అంటే దర్శకుడు లోకేష్ రాబోయే LCU వరల్డ్ లోకి తమ అసిస్టెంట్ దర్శకులను రంగాల్లోకి దింపే అవకాశం ఉందట.

By:  Tupaki Desk   |   15 Nov 2023 7:49 AM GMT
LCU -ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదు
X

లోకేష్ కనగరాజు చేసింది కొన్ని సినిమాలైనా సౌత్ సినిమా ఇండస్ట్రీలో కెరీర్ కు సరిపోయేంత క్రేజ్ అయితే అందుకున్నాడు. ఇక అతని నుంచి రాబోయే ప్రాజెక్టులకు కూడా ఇప్పుడే తగినంత పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్గా వచ్చిన లియో సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు కాస్త నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకుంది.

ఖైదీ విక్రమ్ సినిమాలు ఇంతకుముందే ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు అతను క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని మల్టివర్స్ కథలను అందించనున్నారు. వాటి కోసం అతని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం తలైవా రజినీకాంత్ తో ఒక సినిమా చేసేందుకు బిజీ అవుతున్నాడు. దాదాపు ఆరు నెలల పాటు స్క్రిప్టు కోసం టైం తీసుకున్నాను.

ఇక లేటెస్ట్ గా LCU పై ఎవరూ ఊహించని గాసిప్ ఒకటి వైరల్ గా మారుతుంది. అదేమిటి అంటే దర్శకుడు లోకేష్ రాబోయే LCU వరల్డ్ లోకి తమ అసిస్టెంట్ దర్శకులను రంగాల్లోకి దింపే అవకాశం ఉందట. ఖైదీ 2 విక్రమ్ లాంటి ప్రాజెక్టులను లోకేష్ సహాయక దర్శకులు డైరెక్ట్ చేసే అవకాశం ఉందట. ఖైదీ సినిమా నుంచి తనని చాలా బలంగా ఫాలో అవుతున్న అసిస్టెంట్ దర్శకులను లోకేష్ ఏ మాత్రం వదులుకోలేదట.

మొదట వారికి తన కథలతోనే అవకాశాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కథలను డెవలప్ చేయడంలో అందరూ కూడా బిజీ అయినట్లు సమాచారం. లోకేష్ కనకరాజు రోలెక్స్ పాత్రకు సంబంధించిన సినిమా మాత్రమే డైరెక్టర్ చేసే అవకాశం ఉందట. ఆ తర్వాత మాత్రం ఎక్కువగా అతన్ని సహాయక దర్శకులు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది అనేది తెలియాలి అంటే కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం లోకేష్ రజినీకాంత్ తో ఒక సినిమా చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇది కూడా మల్టివర్స్ లో ఒక భాగమే అని సమాచారం. అలాగే ప్రభాస్ రామ్ చరణ్ లాంటి హీరోలతో కూడా లోకేష్ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక రజనీకాంత్ ప్రాజెక్టును కూడా అతివేగంగా పూర్తి చేయాలి అని లోకేష్ ఆలోచిస్తున్నాడు.