ఆ ప్లానింగ్ లోనే స్మాల్ స్క్రీన్ తళుకులా..?
ఒకప్పటి హీరోయిన్స్ అంతా కూడా ఇప్పుడు మళ్లీ తెర మీద రీ ఎంట్రీ ఇస్తున్నారు.
By: Tupaki Desk | 1 May 2025 3:59 AMఒకప్పటి హీరోయిన్స్ అంతా కూడా ఇప్పుడు మళ్లీ తెర మీద రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్స్ రోల్స్ చేయడం కష్టం కాబట్టి వారికి తగిన పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈమధ్యనే మన్మథుడు సినిమా అన్షు మజాకా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె దారిలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ కూడా సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తుంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తమ్ముడు సినిమాలో లయ సిస్టర్ రోల్ చేస్తుంది. ఈ సినిమాలో ఆమెది ప్రధాన పాత్ర అని తెలుస్తుంది.
దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్, లయ మధ్య ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ని కట్టిపడేస్తాయని అంటున్నారు. ఐతే రీ ఎంట్రీ ఇచ్చే టైం లో లయ ముందు స్మాల్ స్క్రీన్ పై ఆడియన్స్ కి టచ్ లోకి వచ్చింది. సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ షోలో ఆమె ప్రస్తుతం జడ్జిగా కొనసాగుతుంది. అక్కడ శివాజీతో పాటు లయ జడ్జిగా చేస్తుంది. అక్కడ ఆమె పొజిషన్ పర్మినెంటా లేదా టెంపరరీనా తెలియదు కానీ శివాజీ, లయ ఆ జడ్జి సీట్లో కూర్చుంటే చూడటానికి బాగుంది.
ఐతే సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ముందే స్మాల్ స్క్రీన్ పై ఆడియన్స్ కి దగ్గరైతే కెరీర్ మళ్లీ ఊపందుకునే ఛాన్స్ ఉంటుందని లయ ఇలా జబర్దస్త్ షోలో జడ్జిగా చేస్తుంది. తమ్ముడు ఆఫర్ రాగానే ఆమె ముందు ఆలోచించి చేస్తానని చెప్పినా ఎలాగు చాలామంది హీరోయిన్స్ ఈమధ్య రీ ఎంట్రీ చేసి అలరిస్తున్నారనే కారణంతో లయ కూడా ఆ సినిమాకు ఓకే చెప్పింది. ఐతే లయ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల తమ్ముడు సినిమాకు కొంత స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.
జబర్దస్త్ లో జడ్జిగా ఆల్రెడీ ప్రేక్షకులతో సూపర్ అనిపించుకుంటున్న లయ నెక్స్ట్ తమ్ముడు సినిమాతో మరోసారి తన సిల్వర్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ తో అలరించాలని చూస్తుంది. తమ్ముడు సినిఒమా మీద నితిన్ కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రాబిన్ హుడ్ అంచనాలను అందుకోలేదు కాబట్టి తమ్ముడు సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు నితిన్. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. షూటింగ్ చివరి దశలో ఉన్న తమ్ముడు సినిమా త్వరలోనే రిలీజ్ ఎప్పుడన్నది ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.