Begin typing your search above and press return to search.

ల‌యపై సీరియ‌స్ అయిన బాల‌య్య‌.. ఎందుకంటే

నందమూరి బాల‌కృష్ణ ఎంత క్ర‌మ శిక్ష‌ణ‌గా ఉంటారో అంతే స‌ర‌దాగా కూడా ఉంటారు. ఆయ‌న సెట్స్ లో ఉంటే చిన్న పిల్ల‌లున్న‌ట్టే ఎంతో సంద‌డిగా ఉంటుంద‌ని ఇప్ప‌టికే చాలా మంది చెప్పారు.

By:  Tupaki Desk   |   14 May 2025 6:30 PM
ల‌యపై సీరియ‌స్ అయిన బాల‌య్య‌.. ఎందుకంటే
X

నందమూరి బాల‌కృష్ణ ఎంత క్ర‌మ శిక్ష‌ణ‌గా ఉంటారో అంతే స‌ర‌దాగా కూడా ఉంటారు. ఆయ‌న సెట్స్ లో ఉంటే చిన్న పిల్ల‌లున్న‌ట్టే ఎంతో సంద‌డిగా ఉంటుంద‌ని ఇప్ప‌టికే చాలా మంది చెప్పారు. కానీ ఆయ‌న్ను దూరం నుంచి చూసిన చాలా మంది మాత్రం బాల‌య్య చాలా కోపిష్టి, ప్ర‌తీ దానికీ సీరియ‌స్ అవుతూంటార‌ని అనుకుంటారు.

తాజాగా అల‌నాటి హీరో ల‌య కూడా బాల‌య్య‌ను అంతే త‌ప్పుగా అర్థం చేసుకున్నాన‌ని చెప్పింది. ఒక‌ప్పుడు త‌న యాక్టింగ్ తో ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న ల‌య కొన్నేళ్ల పాటూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన‌సాగింది. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఇండ‌స్ట్రీ నుంచి దూర‌మైన ల‌య ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.

నితిన్ హీరోగా వేణు శ్రీ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న త‌మ్ముడు సినిమా ద్వారా ల‌య మ‌ళ్లీ ఇండ‌స్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో నితిన్ కు అక్క పాత్ర‌లో ల‌య క‌నిపించ‌నుంది. త‌మ్ముడు మూవీలో ల‌య పాత్ర ఎంతో కీల‌కంగా ఉండ‌నుంద‌ని ఇప్ప‌టికే యూనిట్ స‌భ్యులు చెప్తుండ‌గా రీసెంట్ గా ల‌య ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని నంద‌మూరి బాల‌కృష్ణ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

బాల‌య్యతో క‌లిసి ల‌య విజయేంద్ర వ‌ర్మ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ టైమ్ లో బాల‌య్య త‌న‌పై సీరియ‌స్ అయ్యార‌ని చెప్పింది ల‌య‌. సీన్ రిహార్సిల్స్ చేస్తున్న టైమ్ లో చూసుకోకుండా తాను బాల‌య్య కాలును తొక్క‌డంతో వెంట‌నే బాల‌య్య నా కాలు తొక్కుతావా? షూటింగ్ కు ప్యాక‌ప్ చెప్పేసి, వెంట‌నే ఈ అమ్మాయిని తీసేయండని సీరియ‌స్ అవ‌డంతో త‌న‌కు ఏడుపొచ్చేసి అక్క‌డి నుంచి వెళ్లిపోయాన‌ని చెప్పింది. ఆ త‌ర్వాత వెంట‌నే బాల‌య్య గారు ఆ అమ్మాయి ఏడ్చేస్తుంది. వెళ్లి ఆమెను ఆపేయండి, నేనేదో స‌ర‌దాగా అన్నాను. నిజ‌మ‌నుకున్నావా అంటూ న‌వ్వార‌ని, ఆయ‌న సెట్ లో ఎంతో స‌ర‌దాగా ఉంటార‌ని ల‌య వెల్ల‌డించింది. బాల‌య్య గురించి ల‌య చేసిన ఈ కామెంట్స్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.