10 కేజీల బరువు పెరిగి మరీ కెమెరా ముందుకు!
స్వచ్ఛమైన తెలుగు నటి లయ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ నితిన్ హీరోగా నటిస్తోన్న `తమ్ముడు` సినిమాతో కంబ్యాక్ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Jun 2025 2:00 PM ISTస్వచ్ఛమైన తెలుగు నటి లయ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ నితిన్ హీరోగా నటిస్తోన్న 'తమ్ముడు' సినిమాతో కంబ్యాక్ అవుతోన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన లయ అటుపై వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడింది. దీంతో సినిమా అవకాశాలు వచ్చినా నటించలేదు. మళ్లీ చాలా కాలానికి లయ మనసు సినిమాలు కోరుకోవడంతో పాటు, భర్త సహకారం కూడా లభించడంతో మళ్లీ మ్యాకప్ ఎందుకు వేసు కోకూడదు అన్న ఆలోచనతో హైదరాబాద్ లో వాలిపోయింది.
'తమ్ముడు' సినిమాలో ఛాన్స్ అందకుంది. తాజాగా ఈ సినిమా అంగీకరించడానికి గల కారణాలు లయ రివీల్ చేసింది. 'కథ వినగానే కంబ్యాక్ అవ్వడానికి ఇదే సరైన సినిమా అనిపించింది. ఇంత బలమైన పాత్రను గతంలో ఎప్పుడూ పోషించలేదు. అందుకే ఈ పాత్ర కోసం పది కిలోల బరువు కూడా పెరిగి కెమెరా ముందుకొచ్చా. గతంలో చేసిన సినిమాలన్నీ ఓ చరిత్ర. దాంతో సంబంధం లేకుండా ఓ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నా.
అమెరికాలో స్థిరపడిన తర్వాత సినిమాలు కూడా చూడటం మానేసాను. చూస్తే బాధపడాల్సి వస్తుందని అలా చేసేదాన్ని. హీరోయిన్ గా ఫాం లో ఉన్నప్పుడే సినిమాలు వదిలేసాను. అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీ ఉద్యోగం చేసాను. ఈసినిమా కథను ఓ లైన్ గా దర్శకుడు ఫోన్ లో చెప్పాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత పూర్తి కథ విన్నాను. నితిన్ కి సోదరిగా ఝాన్సీ కిరణ్మయి అనే పాత్రలో కనిపిస్తా.
ఎవరికీ భయపడని మనస్తత్వం తనది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుడికి నా పాత్ర గుర్తుండాలి. అలాంటి మంచి పాత్రలే చేయాన్నదే నా తపన. లయ ఇలాంటి పాత్రలు చేసిందేంటి? అని ఎవరూ మాట్లాడుకోకూడదు.` అని తెలిపింది.
