అందుకే తమ్ముడు కు సైన్ చేశా
స్వయంవరం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన లయ ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో అందరినీ అలరించి, ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది లయ.
By: Tupaki Desk | 25 Jun 2025 1:00 AM ISTస్వయంవరం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన లయ ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో అందరినీ అలరించి, ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది లయ. చిన్న హీరోలతో మొదలుపెట్టి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించిన లయ, సినిమాలు చేస్తున్నప్పుడే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి సెటిలైంది.
అయితే ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత లయ నటిగా తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతుంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తోన్న తమ్ముడు సినిమా ద్వారా లయ మళ్లీ సినిమాల్లోకి కంబ్యాక్ ఇవ్వనుంది. ఈ సినిమాలో నితిన్ కు అక్క పాత్రలో లయ కనిపించనుంది. తమ్ముడు సినిమాలో లయ క్యారెక్టర్ ఎంతో కీలకం కానుందని సినిమా టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా జులై 4న తమ్ముడు మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా లయ పలు ఇంటర్వ్యూలిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. తన రీఎంట్రీకి తమ్ముడు సినిమానే ఎందుకు ఎంచుకుందనే విషయాన్ని లయ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
దిల్ రాజు ప్రమేయం, తమ్ముడు సినిమాలోని కథాబలం వల్లే తాను ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లయ వెల్లడించింది. తమ్ముడు మూవీలోని క్యారెక్టర్ తననెంతో ఎగ్జైట్ అయ్యేలా చేసిందని, ఈ పాత్రలో ఎమోషన్ మరియు నటించడానికి బాగా స్కోప్ ఉందని, ఇన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న తాను తిరిగి దిల్ రాజు బ్యానర్ తో రీఎంట్రీ ఇవ్వడం ఎంతో ఆనందాన్నిస్తుందని లయ పేర్కొంది.
