Begin typing your search above and press return to search.

రజనీ కోసం విలన్​గా బిగ్ టాలెంటెడ్ స్టార్

స్వతహాగానే రజిని అభిమాని అయిన లారెన్స్.. రజినీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పట్నుంచో భావిస్తున్నానని చాలా చెప్పారు.

By:  Tupaki Desk   |   3 Nov 2023 12:02 PM GMT
రజనీ కోసం విలన్​గా బిగ్ టాలెంటెడ్ స్టార్
X

రీసెంట్​గా జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్​లో పెట్టారు. ఈ సక్సెస్ ఇచ్చిన బూస్ట్​తో మొదట టీజె జ్ఞానవేల్​తో తలైవర్ 170 సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈ చిత్రంతో పాటు తలైవర్ 171 కూడా షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ చిత్రంలో స్టార్ హీరో రాఘవ లారెన్స్​ విలన్​గా నటించబోతున్నారని తెలిసింది.

వివరాళ్లోకి వెళితే.. రజనీ కాంత్​ తలైవర్171 చిత్రాన్ని దర్శకుడు లోకేశ్​ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎల్​సీయూలో భాగంగా కాకుండా స్టాండ్​అలోన్​గా తెరకెక్కించబోతున్నారు లోకేశ్​. తాజగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో విలన్​గా రాఘవ లారెన్స్ నటిస్తున్నారనే వార్త తమిళ్ మీడియాలో తెగ హల్ చల్ అవుతోంది. స్వతహాగానే రజిని అభిమాని అయిన లారెన్స్.. రజినీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పట్నుంచో భావిస్తున్నానని చాలా చెప్పారు. ఇప్పుడు లోకేశ్​ కనగరాజ్.. రజినీతో చేస్తున్న సినిమాలో ఒక పవర్ ఫుల్ నెగిటివ్ రోల్ ఆఫర్ ఇచ్చారని, ఇక రజినీతో సినిమా అనగానే విలన్ రోల్ అయినా సరేనని లారెన్స్ ఓకే చెప్పారని కథనాలు వస్తున్నాయి.

కానీ ఈ వార్తపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. అయితే లోకేశ్ కనగరాజ్ సినిమాల్లో హీరోలు విలన్​గా నటించడం కామన్. పైగా వాళ్లని హీరోతో సమానంగా ఎలివేట్ చేస్తుంటారు లోకేశ్​. దీంతో లారెన్స్ విలన్​గా నటిస్తున్నారన్న వార్తలు వినగానే.. లోకి లారెన్స్​ను ఏ రేంజ్​లలో చూపిస్తారన్న అంశంపై సినీ ప్రియులు ఇప్పటి నుంచి ఊహించడం ప్రారంభించేశారు.

కాగా, లోకేశ్​ రీసెంట్​గా ఎల్​సీయూలో భాగంగా లియోతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా డీసెంట్​ టాక్​ను అందుకుని సంచలన వసూళ్లను అందుకుంది. ఇక రాఘవ లారెన్స్​.. ఇటీవలే చంద్రముఖి 2తో వచ్చి డిజాస్టర్​టాక్​ను అందుకున్నారు. త్వరలోనే ఆయన జిగర్తాండ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.